అపూర్వ సమ్మేళనం..34 ఏళ్ల తరువాత కలుసుకున్న దోమలగూడ ప్రభుత్వ కాలేజీ పీడీలు, పీఈటీలు

అపూర్వ సమ్మేళనం..34 ఏళ్ల తరువాత కలుసుకున్న దోమలగూడ ప్రభుత్వ కాలేజీ పీడీలు, పీఈటీలు

ముషీరాబాద్, వెలుగు: హైదరాబాద్​ నగరంలోని దోమల్​గూడ ప్రభుత్వ కాలేజీలో ఫిజికల్  ఎడ్యుకేషన్ కోర్స్​ చేసిన పీడీలు, పీఈటీలు 34 ఏండ్ల తరువాత గురువారం కలుసుకున్నారు. 1992–-93 యూజీడీ బ్యాచ్ కు చెందిన ఏపీ, తెలంగాణలోని 60 మంది పూర్వ విద్యార్థులు ఫిజికల్  డైరెక్టర్  దువ్వాల రవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆనందం, ఆప్యాయత, జ్ఞాపకాలతో భావోద్వేగానికి గురయ్యారు. కాలేజీ రోజులను గుర్తు చేసుకొని సందడి చేశారు. నిర్వాహకులు పూర్వ విద్యార్థులను సన్మానించి మెమోంటోలు అందజేశారు.