40 ఏళ్ల తర్వాత.. ఇంటర్ పరీక్ష రాసిన మాజీ మావో అగ్రనేత..!

40 ఏళ్ల తర్వాత.. ఇంటర్ పరీక్ష రాసిన మాజీ మావో అగ్రనేత..!

చదువుకోవాల్సిన వయస్సులో సమాజం.. విలువలు.. జనం కోసం పోరాటం చేశారు. జనం కోసం పోరాటం అంటూ అడవి బాట పట్టారు. అలా అడవిలోకి వెళ్లిన ఆయన.. తిరిగి మళ్లీ జన జీవన స్రవంతికిలోకి రావటానికి 40 ఏళ్లు పట్టింది. అలా అడవికి వెళ్లి.. ఇటీవలే జన జీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్ట్ అగ్రనేతనే తెలంగాణకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ. 

40 ఏళ్ల క్రితం ఇంటర్ పరీక్షలు రాసిన మావోయిస్ట్ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ.. ఇంటర్ పరీక్షల్లో కొన్ని సబ్జెక్ట్స్ తప్పారు. అడవి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలాగైనా ఇంటర్ ఎగ్జామ్స్ పూర్తి చేయాలని భావించారు. అందులో భాగంగా.. 2026, మే 13వ తేదీన జరిగిన సెకండ్ ఇయర్ ఇంటర్ తెలుగు పరీక్షకు హాజరయ్యారాయన. 

ALSO READ : పుచ్చకాయపై ఏంటీ చావు వార్తలు..

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని మాస్ట్రో జూనియర్ కాలేజీలో ఆయనకు సెంటర్ పడింది. చేతిలో ప్యాడ్, హాల్ టికెట్ తో ఆయన ఎగ్జామ్ సెంటర్ దగ్గరకు వచ్చారు. సెంటర్ లోకి వెళ్లే ముందు తన హాల్ టికెట్ వెరిఫికేషన్ చేయించుకున్నారు. సెంటర్ లోపల పిల్లలతో కలిసి ఎగ్జామ్ రాశారు ఈ మావో మాజీ అగ్రనేత. 

జన జీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత.. ఎక్కడ అయితే తన చదువు ఆగిపోయిందో.. అక్కడి నుంచి మళ్లీ మొదలుపెట్టాలనే ఉద్దేశంతో.. ఇంటర్ పూర్తి చేయాలనే లక్ష్యంతో మళ్లీ చదువుపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారాయన.