బాలయ్యతో ఫ్యామిలీ సినిమానా.. వర్కౌట్ అవుతుందా?

బాలయ్యతో ఫ్యామిలీ సినిమానా.. వర్కౌట్ అవుతుందా?

మాస్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జామ్పుల్ అంటే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) అని చెప్పొచ్చు. ఆయన సినిమాల్లో మాస్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్   నెక్స్ట్ లెవల్లో ఉంటాయి. వాటిని బేస్ చేసుకొనే ఆయనతో సినిమాలు ప్లాన్ చేస్తుంటారు మేకర్స్. ఈ మధ్య బాలయ్య నుండి వచ్చిన అన్ని సినిమాలు మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని తీసినవే. 

అయితే తాజాగా సమాచారం ప్రకారం బాలకృష్ణ తన తరువాతి సినిమా కోసం పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథను సెలెక్ట్ చేసుకున్నారట. ఈ మధ్యే దర్శకుడు బాబీ కొల్లి(Bobby Kolli)తో ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బాలయ్య. సితార ఎంటర్టైన్మెంట్స్(Sitara entertainments), శ్రీకర స్టూడియోస్(Srikara Studios) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. అనౌన్స్మెంట్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మాస్ అప్పీల్ ఉన్న ఈ పోస్టర్ కు నందమూరి ఫ్యాన్స్ నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాలో బాలయ్యను సరికొత్తగా చూపించబోతున్నాడట దర్శకుడు బాబీ. ఈసారి యాక్షన్ డ్రామా కాకుండా.. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ కథకు ఎమోషన్స్ యాడ్ చేసి పర్ఫెక్ట్ కథను సెట్ చేశాడట బాబీ.

అయితే బాలయ్య సినిమా అంటేనే యాక్షన్ అండ్ మాస్ అంశాలతో నిండి ఉంటుంది. బాలయ్య ఫ్యామిలీ చేస్తే అది వర్కౌట్ అవుతుందా? ఇది కాస్త రిస్క్ అనే కామెంట్స్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. మరి చాలా రోజుల తరువాత ఫ్యామిలీ మూవీతో వస్తున్న బాలయ్యకు ఎలాంటి రిజల్ట్ ఎదురవుతుందో చూడాలి.