టీకా తీసుకున్నాక కూడా పాజిటివ్ వస్తుందా?

టీకా తీసుకున్నాక కూడా పాజిటివ్ వస్తుందా?

న్యూఢిల్లీ: వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కరోనా సోకుతుందా అనే సందేహం చాలా మందికి వస్తోంది. టీకా తీసుకున్న తర్వాత వైరల్ టెస్టులు చేయిస్తే కరోనా పాజిటివ్‌గా వస్తోందని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇది నిజం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. టీకా తీసుకున్నాక శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ స్పందిస్తుందని.. ఈ టైమ్‌‌లో ఏదైనా యాంటీ బాడీ టెస్టు చేయిస్తే పాజిటివ్‌‌గా రావడం సహజమేనని నిపుణులు పేర్కొంటున్నారు. దీనర్థం గతంలో మీకు కరోనా సోకి ఉంటే, మీరు తీసుకున్న వ్యాక్సిన్ వల్ల శరీరంలో యాంటీ బాడీస్ పెంపొందుతుండటమే కారణమని హెల్త్ ఎక్స్‌‌పర్ట్స్ అంటున్నారు. దీనికి సంబంధించి యాంటీ బాడీ టెస్టింగ్ రిజల్ట్స్‌పై కరోనా వ్యాక్సినేషన్ ఎలా పని చేస్తుందో తెలుసుకునే పనిలో ఎక్స్‌‌పర్ట్స్ బిజీగా ఉన్నారు.