ఇవాళ మరోసారి పలు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు

ఇవాళ  మరోసారి పలు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు

PFI నేతల ఇళ్లల్లో NIA సోదాల తర్వాత...కీలక విషయాలు బయటకొచ్చాయి. బీజేపీ, RSS అగ్రనేతలే లక్ష్యంగా దాడులుకు కుట్ర పన్నినట్లు అధికారులు తెలిపారు. నవరాత్రుల టైంలో నేతల కదలికలపై PFI దృష్టి పెట్టేలా ప్లాన్ చేసిందని.... మహారాష్ట్ర ATS పోలీసుల దర్యాప్తులో తేలింది. నాగపూర్ లోని RSS కార్యాలయం దగ్గర రెక్కీ నిర్వహించినట్లు తెలిపారు. బీజేపీ, సంఘ్ నేతలతో సహా కేంద్ర ఏజెన్సీల అధికారులు కూడా.... PFI హిట్ లిస్టులో ఉన్నట్లు సమాచారం. బీజేపీ, RSS నేతలను నిఘా సంస్థలు అప్రమత్తం చేశాయి.

ఇవాళ మరోసారి పలు రాష్ట్రాల్లో NIA, ED సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాయి. దాదాపు 10 రాష్ట్రాల్లో పలు చోట్ల సోదాలు చేపట్టాయి.  ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర,  ఢిల్లీ,  కేరళ,  గుజరాత్,  అసోం, కర్ణాటకలో దాడులు చేస్తున్నారు. ఈ ఆపరేషన్ లో పలు చోట్ల సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐబీ, రాష్ట్ర పోలీసులు కూడా భాగమయ్యారు. గత రెండు వారాల్లో PFI మద్దతుదారుల ఇళ్లల్లో దాడులు చేపట్టడం ఇది మూడోసారి. తెలంగాణలో ఎలాంటి దాడులు జరగడం లేదని ప్రకటించారు.


అసోం నాగర్ బెరా ప్రాంతంతో PFIతో సంబంధం ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నాగర్ బెరా జిల్లాలో అనేక ప్రాంతాలల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. PFI వ్యతిరేకంగా ఆపరేషన్ కొనసాగుతుందని అసోం ఏడీజీపీ హిరేన్ నాథ్  అన్నారు. అంతకు ముందు అసోంలోని వివిధ ప్రాంతాల నుంచి PFIకి చెందిన 11 మంది కార్యకర్తలను అధికారులు అరెస్టు చేశారు. కర్ణాటకలోని మంగళూరులో పలువురు PFI సభ్యులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలో థానే క్రైం బ్రాంచ్ పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు.