ఈ విజయానికి కారణం ఆయనే.. అల్లు అర్జున్ పోస్ట్ వైరల్

ఈ విజయానికి కారణం ఆయనే.. అల్లు అర్జున్ పోస్ట్ వైరల్

పుష్ప(Pushpa) సినిమాలో తన అద్భుతమైన నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు(National award) అందుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu arjun). తెలుగు హీరోల్లో ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు బన్నీ. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ఇటీవల(అక్టోబర్ 17) భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(Droupadi murmu) చేతుల మీదుగా ఈ అవార్డ్ అందుకున్నాడు అల్లు అర్జున. దీంతో ఇండస్ట్రీ ప్రముఖులు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 

Also Read : నాకు నమ్మకం ఉంది.. రెండేళ్ల తరువాత రెండో పెళ్లి: రేణు దేశాయ్

ఇక జాతీయ అవార్డు అందుకున్న తరువాత మొదటిసారి సోషల్ మీడియా వేదికగా స్పందించాడు అల్లు అర్జున్.. పుష్ప సినిమాకు జాతీయ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవార్డు ఇచ్చిన జ్యూరీకి, భారత ప్రభుత్వానికి, మంత్రిత్వ శాఖకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ అవార్డు నాకు మాత్రమే కాదు.. సినిమాను ప్రేమించి, ఆదరిస్తున్న వారందరికి చెందుతుంది. ముఖ్యంగా దర్శకుడు సుకుమార్(Sukumar) కు నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ విజయానికి కారణం ఆయనే.. అంటూ రాసుకొచ్చాడు అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన పుష్ప ది రూల్(Pushpa the rule) సినిమాలో నటిస్తున్నారు. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో రష్మిక మందన్నా(Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15న ప్రేక్షలుల ముందుకు రానుంది. పుష్ప సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.