తెలంగాణ రాష్ట్రం వచ్చాక జల, మత్స్య సంపద పెరిగింది

తెలంగాణ రాష్ట్రం వచ్చాక జల, మత్స్య సంపద పెరిగింది

చేప పిల్లలను ఉచితంగా అందివ్వడంతో.. తెలంగాణలో మత్స్యకారులు ధనవంతులుగా మారారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మత్స్య శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ లోయర్ మానేరు జలాశయంలో వంద శాతం రాయితీ పై ఉచిత చేప పిల్లలను మంత్రి గంగుల కమలాకర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్, మేయర్ సునీల్ రావు,  జడ్పీ ఛైర్ పర్సన్ కనుమళ్ళ విజయ, కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు నీటి కోసం యుద్దాలు జరిగే పరిస్థితులు ఉండేవన్నారు. గతంలో ఇతర ప్రాంతాల నుంచి చేపపిల్లలను దిగుమతి చేసుకునే వాళ్లమన్న గంగుల... ఇప్పుడు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నామని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ నీలి విప్లవం తీసుకొచ్చి మత్స్యకారులకు అండగా నిలిచారన మంత్రి గంగుల ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ప్రతీ సీజన్ లో 30 లక్షల చేపపిల్లలను కరీంనగర్ జిల్లాలో వదులుతున్నామన్న మంత్రి... ఒక కోటి 50 లక్షల చేప పిల్లలను డ్యాం లో విడుదల చేశామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రెండు కోట్ల 80 లక్షల విలువ చేసే రెండు కోట్ల 10 లక్షల చేప పిల్లలను కరీంనగర్ జిల్లాలోని చెరువులతో పాటు ఎల్.ఏం.డి రిజర్వాయర్ లో వదిలి పెట్టామని చెప్పారు. అంతే కాదు తెలంగాణ రాష్ట్రం వచ్చాక జల సంపద, మత్స్య సంపద పెరిగిందని గంగుల తెలిపారు.