సికింద్రాబాద్ విధ్వంసంలో పాల్గొన్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం

సికింద్రాబాద్ విధ్వంసంలో పాల్గొన్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం

అగ్నిపథ్ పథకం నేపథ్యంలో దేశంలోని పలు ప్రాంతాల్లో ఆర్మీ అభ్యర్థులు చేపట్టిన నిరసనల గురించి అందరికీ తెలిసిందే. ఇదే తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోనూ పలు రైళ్లను తగలబెట్టిన యువత... తీవ్ర ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో నిరసనలో పాల్గొని, అలజడులు సృష్టించిన వారిపై పోలీసులు చర్యలకు పూనుకున్నారు. అందులో భాగంగా ఇప్పటికే చాలా మంది యువకులను ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో పాల్గొ్న్న జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ కు చెందిన గోవింద్ అజయ్ అనే యువకుడు తాజాగా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ అల్లర్లలో భాగంగా ఒక టీవీ ఛానల్ లో మాట్లాడిన అజయ్... తన మీద పోలీసులు కేసు నమోదు చేస్తారేమో అన్న భయంతోనే ఆత్మ హత్య యత్నానికి పాల్పడినట్టు సమాచారం. వెంటనే ఈ యువకున్ని వరంగల్ ఎంజీఎంకు తరలించగా... ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది.