ఫేక్ క్యాస్ట్ సర్టిఫికెట్ఆరోపణలపై విచారణ

ఫేక్ క్యాస్ట్ సర్టిఫికెట్ఆరోపణలపై విచారణ

మంగపేట, వెలుగు: బ్రాహ్మణ కులానికి చెందిన తప్పుడు ధ్రువీకరణ పత్రాలు పొందినట్లు ఆరోపణలు రావడంతో ములుగు జిల్లా మంగపేట తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం విచారణ జరిపారు. కలెక్టర్ ఆదేశాలతో తహసీల్దార్ తోట రవీందర్ ఈ విచారణ చేపట్టారు.

మంగపేట మండలం మల్లూరు గ్రామానికి చెందిన అనిపెద్ది రాజీవ్ నాగశర్మ, అనిపెద్ది మురళీ మోహన్ శర్మ, వై.ఈశ్వర్ చంద్, ముక్కామల వెంకటనారాయణ శర్మలు అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు పొందినట్లు హేమాచల లక్ష్మీనరసింహ స్వామి ఆలయ రిటైర్డ్ అర్చకులు కైంకర్యం రాఘవాచార్యులు గతేడాది డిసెంబర్ 29న మంగపేట తహసీల్దార్ కార్యాలయంలో, ఈ ఏడాది జనవరి 9న కలెక్టర్‌‌కు ఫిర్యాదు చేశారు. దీంతో తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేపట్టిన అధికారులు వివరాలు సేకరించారు. తప్పుడు సమాచారంతో కుల ధ్రువీకరణ పత్రాలు పొందినట్లు తేలితే వాటిని ద్దు చేసి కలెక్టర్‌‌కు నివేదిక అందజేస్తామని తహసీల్దార్​ తెలిపారు.