ములుగు, వెలుగు: మండల కేంద్రంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ వర్సిటీ, హైదరాబాద్ లోని నవరత్న క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్సీఎస్)మధ్య అవగాహన ఒప్పందం కుదిరినట్లు శనివారం వర్సిటీ చాన్స్లర్దండా రాజిరెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యాన రంగంలో విద్య, పరిశోధన, విస్తరణ కార్యకలాపాలను బలోపేతం చేసే దిశగా కీలక భాగస్వామ్యం కుదిరిందన్నారు.
నవరత్న క్రాప్ సైన్స్ సంస్థ, పోస్ట్ గ్రాడ్యుయేట్ రీసర్చ్ లేబొరేటరీని పరిశోధన కోసం గుర్తించామన్నారు. ఉత్పన్నమయ్యే మేధో సంపత్తి హక్కులపై ఇరు సంస్థలకు ఉమ్మడి యజమాన్యం ఉంటుందన్నారు. కార్యక్రమంలోని రిజిస్టర్ భగవాన్, ఎన్సీఎస్మేనేజింగ్ డైరెక్టర్ హలీ, అధికారులు లక్ష్మీనారాయణ, సురేశ్ కుమార్, శ్రీనివాస్, విజయ, సనందిని, సతీశ్పాల్గొన్నారు.
