యూరియా కృత్రిమ కొరతవ్యాఖ్యలు అవాస్తవం :వ్యవసాయ శాఖ

యూరియా కృత్రిమ కొరతవ్యాఖ్యలు అవాస్తవం :వ్యవసాయ శాఖ
  • లెక్కలతో సహా వెల్లడించిన అగ్రికల్చర్​ డిపార్ట్​మెంట్
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి వ్యవసాయ శాఖ కౌంటర్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావు చేసిన వ్యాఖ్యలపై  వ్యవసాయ శాఖ స్పందించింది.  ఈ మేరకు పూర్తి లెక్కలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి పంపుతూ మీడియాకు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ వానాకాలం సీజన్​లో కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్​ నుంచి సెప్టెంబర్​ వరకు యూరియా రాష్ట్ర కోటా 9.80 లక్షల టన్నులు కేటాయించిందని తెలిపింది.

ఆగస్టు వరకు 8.30 లక్షల టన్నుల యూరియా రావాల్సి ఉందని.. కానీ, ఇప్పటి వరకు కేవలం 5.18 లక్షల టన్నులు మాత్రమే వచ్చిందని తెలిపింది. ఇంకా 3.12 లక్షల టన్నుల యూరియాను సప్లయ్​ చేయకుండా కోత విధించిందని తెలిపారు. గత 5 నెలలుగా ఏ నెలలోనూ కేంద్రం పూర్తి స్థాయి కోటా విడుదల చేయలేదని స్పస్టం చేసింది.