రైతులకు గుడ్ న్యూస్: యూరియాపై వ్యవసాయ శాఖ కీలక ప్రకటన

రైతులకు గుడ్ న్యూస్: యూరియాపై వ్యవసాయ శాఖ కీలక ప్రకటన

హైదరాబాద్: యూరియా కోసం ఇబ్బంది పడుతోన్న రైతులకు వ్యవసాయ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రైతులు ఎవరూ ఇబ్బందులు పడొద్దని.. రాష్ట్రానికి సరిపడా యూరియా దిగుమతి అవుతుందని తెలిపింది. రాష్ట్రానికి సోమవారం (సెప్టెంబర్ 1) 8 వేల మెట్రిక్ టన్నులు.. మంగళవారం (సెప్టెంబర్ 2) 5 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయ్యిందని వెల్లడించింది. మరో వారం రోజుల్లో రాష్ట్రానికి 27, 470 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని తెలిపింది. 

సనత్ నగర్, వరంగల్, జడ్చర్ల, నాగిరెడ్డిపల్లి, మిర్యాలగూడ, కరీంనగర్, నిజామాబాద్ రైల్వే పాయింట్ల ద్వారా 14 వేల మెట్రిక్ టన్నుల సరఫరా అయినట్లు వెల్లడించింది. రానున్న వారం రోజుల్లో కరాయికల్, గంగవరం, దామ్ర పోర్టుల ద్వారా రాష్ట్రానికి 27, 470 టన్నులు సరఫరా అవుతుందని తెలిపింది. రైతులకు ఇబ్బందులు లేకుండా యూరియా సరఫరా చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అధికారులను ఆదేశించారు.

ALSO READ : కరీంనగర్లో హాట్ టాపిక్గా.. ఈ అన్న వెరైటీ నిరసన..