సెప్టెంబర్ చివరలో అగ్రికల్చర్ ఎంసెట్!

సెప్టెంబర్ చివరలో అగ్రికల్చర్ ఎంసెట్!

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ నిర్వహణపై హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కసరత్తు చేస్తోంది. ఈ నెల 31న ఈసెట్, సెప్టెంబర్ 9 నుంచి ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్ తేదీలను ఖరారు చేయగా, మిగిలిన ప్రవేశ పరీక్షల డేట్లను డిసైడ్ చేసే పనిలో అధికారులు ఉన్నారు. సెప్టెంబర్ 4వ వారంలో ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ కు రెండు రోజుల పాటు నాలుగు సెషన్స్లో పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. అయితే ఎంట్రెన్స్ఎగ్జామ్స్ని ర్వహణపై హైకోర్టులో కేసు నడుస్తోంది. ఈ నెల 23న ఈసెట్, ఎంసెట్(ఇంజనీరింగ్) పరీక్షల నిర్వహణకు సంబంధించిన సమాచారంతో అఫిడవిట్ దాఖలు చేయనున్నట్టు అధికారులు చెప్తున్నారు.

జేఈఈ పరీ క్షల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో, ఎంట్రెన్స్ లకు ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు. అన్ని ఎగ్జా మ్స్ సెప్టెంబర్లోనే.. మంగళవారం హైదరాబాద్లో టీసీఎస్, టీఎస్ ఆన్ లైన్ అధికారులతో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ పాపిరెడ్డి, ఇతర ఆఫీసర్లు సమావేశయ్యారు. ఆన్లైన్ పరీక్షల నిర్వహణ కోసం ఖాళీగా ఉన్న స్లాట్ వివరాలను సేకరించారు. సెప్టెంబర్ 20 నుంచి పలు తేదీలుగా ఖాళీగా ఉండటంతో సూచన ప్రాయంగా కొన్నింటిని అనుకున్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో చర్చించి వీటిపై నిర్ణయాన్ని ప్రకటించే చాన్స్ ఉంది. ఎడ్ సెట్ మినహా మిగిలిన ఐసెట్, లాసెట్, పీజీఈసెట్ తదితర పరీక్షలన్నీ సెప్టెంబర్ లోనే పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఎడ్ సెట్ ను అక్టోబర్ ఫస్ట్వీక్లో పూర్తి చేసేందుకు, డిగ్రీ కో ర్సుల్లోప్రవేశాల కోసం ఈ నెల 20న దోస్త్ నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

టెస్టులు పెంచకుంటే కరోనాను ఆపలేం