పరిశోధనలకు పుట్టినిల్లు..

పరిశోధనలకు పుట్టినిల్లు..

దశాబ్ధాలుగా కరువు జిల్లా కరువు, వలసల జిల్లా గాపేరున్న మహబూబ్ నగర్ లోనే ప్రసిద్ధి పొందిన వ్యవసాయ పరిశోధనల కేంద్రం. పాలెంలో యాభైఏళ్ల కిందనే ఈ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏర్పాటయ్యిం ది. పరిశోధనలకు అనువైన ప్రాంతంగాపేరున్న పాలెంలో తేలికపాటి భూములకు నెలవైనదక్షిణ తెలంగాణ లో పంటలు పండిం చడానికిఅనువైన సాంకే తిక పరిజ్ఞా నాన్ని రైతులకందిం చాలని పాలెంలోని కొందరు పెద్దలు సంకల్పిం చారు.పాలెం గ్రామానికి చెందిన తోటపల్లి సుబ్రమణ్యంశర్మ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఏపీ వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో 1970లో వ్యవసాయకేంద్రం ఏర్పాటు చేశారు. నాటి నుంచి దినదినాభివృద్ధి చెందుతూ ప్రపంచ దేశాలకు సైతం నూతనవంగడాలనందించే స్థాయికి పాలెం కేంద్రంచేరింది. 1970 మే తొమ్మిదో తేదీన 20 ఎకరాలను లీజ్ కు తీసుకొని ఇద్దరు శాస్రవేత్తలతో కేంద్రం ప్రారంభించారు.

1980 అక్టోబర్ లో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంగా 250 ఎకరాలకు అప్గ్రేడ్ చేశారు. పాలెం పరిశోధన కేంద్రం కింద నాటి తెలంగాణ ఉమ్మడి జిల్లాలైన మహబూబ్ నగర్ ,నల్గొండ ,హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను కలిపి 402 మిలియన్ హెక్టార్ విస్తీరణంలో పరిశోధనలువిస్తరించారు . రాష్ర్ట భౌగోళిక విస్తీర్ణం లో 14.25శాతం దక్షిణ తెలంగాణ మండలం కలిగి ఉంది.పరిశోధన కేంద్రం కింద 7 పరిశోధన విభాగాలురాజేంద్రనగర్ ,తాండూర్ ,కంపసాగర్ తో పాటు3 ఏరువాక కేంద్రాలు , రెం డు కృషి విజ్ఞా న కేంద్రాలతో వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా రు . పాలెం వ్యవసాయ పరిశోధన స్థా నం లోనిపుణులైన విత్తనోత్పత్తి , తెగుళ్ళు ,కీటక ,ఇతరత్రాపంటలపై శాస్త్రవేత్తలు వ్యవసాయ పరిశోధనలపైవిసృత్తంగా కృషి చేస్తున్నారు. అధిక దిగుబడులునిచ్చే కొత్త వంగడాలు ఉత్పత్తి చేయడమే కాకకీటకాలు, తెగులపై పరిశోధన, అధిక దిగుబడులపై కొత్త పద్ధతులు, పరికరాల వినియోగం వంటివాటిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఆముదం, జొన్న, సజ్జ, కంది, పెసర, బొబ్బర్లు, ఉలువలురాగులు, కొర్ర, పొద్దు తిరుగుడు ,రకాల పై పరిశోధనలు జరుపుతూ ఇప్పటికి 26 హైబ్రీడ్ రకాలనుసృష్టించారు. ప్రఖ్యాతి గాంచిన ఇక్రిశాట్, ఐఏఈఏ, ఎఫ్ ఏవో , ఏఏటీపి , ఏపీఎస్ ఎల్ ..బీసీ , వరల్డ్బ్యాం క్ ,డ్వామా తదితర సంస్థల సహకారంతోమెట్ట పంటల విస్తరణ పై పరిశోధనలు నిర్వహిస్తున్నారు .

సమీకృత సాగుపై పరిశోధనలు ..
రైతులు మంచి ఆదాయం పొందేం దుకు శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు చేస్తున్నారు . సాగుయంత్రాల వినియోగం వల్ల కలిగే లాభాలను పరిశోధన కేంద్రంలో కేవీకేలో క్షేత్ర పర్యటనలో రైతులకుఅవగాహన కల్పిస్తున్నారు. చిన్న యంత్రాల నుంచిభారీ యంత్రాల పనితీరు వాటి వినియోగం వల్లఖర్చు , సమయం తగ్గటం తో పాటు ఆదాయం పెంచుకోవచ్చని రైతులకు అవగాహన కల్పి స్తున్నా రు.నీటి కుంటల ఏర్పాటు వల్ల వర్షపు నీటి ని వృధాగాపోనియకుండా నిల్వ చేసుకొని ప్రతికూల పరిస్థితుల్లో ఆ నీటిని పంటలకు ఉపయోగంచి కాపాడుకునేపరిశోధనలు చేస్తున్నా రు . ఆముదంలో పాలెం శాస్త్రవేత్తలు సృష్టించిన క్రాంతి ఆముదం రకం రాష్ట్రంలోవిస్తారంగా వ్యాప్తి చెందిం ది. కంది ,ఆముదం లోనూతన వంగడాలు సృష్టించి దేశంలోనే ఈ క్షేత్రాన్నికి అప్పట్లో ప్రథమ స్థా నం లభించింది . 2010 ,మే13 న గుజారత్ లోని ఆనంద్ ఆగ్రికల్చర్ యూనివర్సటిలోని ఆముదం పై నిర్వహించిన వార్షికసర్వసభ సమావేశం లో పాలెం పరిశోధన కేంద్రంఉత్తమ ఏంసీఆర్సీ సెంటర్ గా జాతీయ అవార్డుసొంతం చేసుకుంది .

పోటీ పరీక్షల్లోను టాప్ ..
వ్యవసాయ పరిశోధన కేంద్రానికి అనుబంధంగాదేశంలోనే మొట్ట మొదటి సారి 1989 లో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీలను స్థా పించారు. 14ఎకరాల్లో విద్యార్థులకు పంటల సరళి ,సాగువిధానలపై శిక్షణ ఇస్తున్నా రు . కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు రాష్ర్ట వ్యాప్తంగా వ్యవసాయశాఖలో ఏఈవో లుగా విధులు నిర్వహిస్తున్నా రు.ఏఈవో లనియమాక పరీక్షలో నాలుగు బ్యాచ్లకు చెందిన 110 మంది విద్యార్థులు ఏఈవోలుగా ఎంపి కయ్యారు . అలాగే అగ్రిసేట్ ద్వారా40 ఏజీబీఎస్సీ సీట్ల లో ఏటా 10 నుంచి 12సీట్లను కైవసం చేసుకుంటూ రాష్ర్టం లో ప్రథమస్థా నంలో నిలుస్తోంది. నూతనంగా వ్యవసాయఏజీబీఎస్సీ కళాశాలను పాలెం లో ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించి 2015 నుంచి 60మంది విద్యార్థులతో తరగతులు ప్రారంభిం చారు. వ్యవసాయంలో వస్తున్న విప్లవా త్మక మార్పులనురైతులకు వేగంగా చేరవేయాలని 2011 లో కృషివిజ్ఞా న కేంద్రాని ఏర్పాటు చేశారు.

పాలెంలో పుట్టిన నూతన వంగడాలు
జొన్న లో పీఎస్ వీ –1 , పీఎస్ వీ పాలెం–2 ,పీఎస్వీ–56 , పీఎస్ హెచ్ – 1 , ఏఎస్ హెచ్– 1 , పీవైవీఎస్–2 , పాలమూర్ జొన్న ,సజ్జలో ముక్తా , మలిఖార్జున , పీహెచ్ బి –3 , రాగి లో మారుతి , కందిలోపీఆర్ జీ –100 , పీఆర్ జీ–158 , పీఆర్ జీ–176 ,ఐసీపీ హెచ్ –740 , ఉలువ లో పాలెం , పాలెం–2, అముదంలో క్రాంతి , హరిత ,కిరణ్ ,పీసి హెచ్ 1 ,పీసీ హెచ్ –111 , పీసీ హెచ్ –222 , ప్రగతి , పొద్దుతిరుగుడులో –66 ప్రాచుర్యం పొందాయి.

 

సమీకృత సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరిస్తున్నాం
కేవీకే వ్యవసాయ పరిశోధన కేంద్రంలోరూపొందించిన వివిధ రంగాల్లో శాస్త్రసాంకేతిక , యంత్ర పరిజ్ఞా నాన్ని ఎప్పటికప్పుడు రైతులకంది స్తు న్నాం . వాతావరణపరిస్థితులకు , నేలల స్వభావానికి అనువైనవంగడాలను , నేలను క్షేత్ర స్థాయిలోపరిశీలించి రైతులకు అవగాహన కల్పించిమంచి దిగుబడితో నికర ఆదా యంపొందేలా కేవీకే ద్వారా కృషి చేస్తు న్నాం.
-డాక్టర్ జగన్ మోహన్ రెడ్డి, కో ఆర్డినేటర్