చరిత్రలో మొదటిసారిగా ఒక దేశం మొత్తం ఖాళీ చేస్తున్నారు: కారణం తెలిస్తే షాక్‌ అవువుతారు..

 చరిత్రలో మొదటిసారిగా ఒక దేశం మొత్తం ఖాళీ చేస్తున్నారు: కారణం తెలిస్తే షాక్‌ అవువుతారు..

పసిఫిక్ ఐలాండ్ దేశమైన తువాలు ఒక కొత్త సమస్యను ఎదుర్కొంటోంది. వాతావరణ మార్పుల కారణంగా మొత్తం దేశ జనాభాని వేరే ప్రాంతానికి పంపించిన చరిత్రలో మొట్టమొదటి దేశంగా మారొచ్చు. సుమారు 11 వేల మంది ప్రజలు ఉండే తువాలు దేశంలో సముద్ర మట్టాలు పెరగడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. 

నాసా ప్రకారం , గత 30 సంవత్సరాలలో తువాలు దేశం చుట్టూ సముద్ర మట్టాలు దాదాపు 15 సెంటీమీటర్లు పెరిగాయి. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ప్రజలు ఉండలేని దేశంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తువాలులో తొమ్మిది చిన్న దీవులు, ద్వీపాలు దాదాపు 26 చదరపు కిలోమీటర్ల ఉన్నాయి, ఇది ప్రపంచంలోని అతి చిన్న దేశాలలో ఒకటి. సగటు ఎత్తు సముద్ర మట్టానికి దాదాపు రెండు మీటర్లు,  తువాలులో సముద్ర ఎత్తు  కొంచెం పెరిగిన కూడా పెద్ద  ప్రమాదానికి గురవుతుంది. దింతో ద్వీపంలోని రోడ్లు, ఇళ్ళు, విమానాశ్రయం వరదలకు గురయ్యే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ ఉప్పునీరు రావడం వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. మారుతున్న వాతావరణం, సముద్ర పరిస్థితుల వల్ల చేపలు పట్టడం, వ్యవసాయం కూడా కష్టమవుతుంది. 

ALSO READ : జమ్మూకాశ్మీర్లో క్లౌడ్ బరస్ట్..

1993 నుండి ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు దాదాపు 10 సెంటీమీటర్లు పెరిగాయని, గత మూడు దశాబ్దాలలో పెరుగుదల రేటు రెట్టింపు అయ్యిందని NASA డేటా చూపిస్తుంది. గ్లోబల్ వార్మింగ్‌ అరికట్టడానికి చర్యలు తీసుకోకపోతే తువాలులోని లోతట్టు దీవులు మునిగిపోవచ్చు. 2022లో తువాలు దేశం ప్రపంచంలోనే మొట్టమొదటి ఫుల్ డిజిటల్ దేశంగా కానున్నట్లు  ప్రకటించింది.