అహల్యాబాయి జీవిత చరిత్ర బుక్ రిలీజ్

అహల్యాబాయి జీవిత చరిత్ర బుక్ రిలీజ్

కామారెడ్డి టౌన్, వెలుగు: మహిళా సాధికారతకు అహల్యాబాయి హోల్కర్‌ నిదర్శనంగా నిలిచారని జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ కొనియాడారు. కామారెడ్డి బీజేపీ ఆఫీస్​లో శనివారం అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆమె జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. బీబీ పాటిల్ మాట్లాడుతూ.. అహిల్యాబాయి వరకట్నం, సతీసహగమనం వంటి దురాచారాలను నిషేధించారని, మహిళలకు విద్య, వితంతువులకు భర్త ఆస్తిపై హక్కు, పునర్వివాహం వంటి అంశాలపై సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారన్నారు. బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ యెండెల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. అహల్యాబాయి పరిపాలనలో అవినీతికి తావు లేదని, ప్రజలకు ఉపాధి కల్పించేందుకు వస్త్ర పరిశ్రమను నెలకొల్పారన్నారు.