Cricket World Cup 2023: ఇండియా- పాక్ మ్యాచుకు వరుణుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనా..?

Cricket World Cup 2023: ఇండియా- పాక్ మ్యాచుకు వరుణుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనా..?

ఆసియా కప్ నుంచి వర్షం సమస్య భారత్ ని వెంటాడుతూ వస్తుంది. ఈ టోర్నీలో ఒకటి రెండు మ్యాచులు మినహాయిస్తే చాలా మ్యాచులు వర్షంలో కొట్టుకుపోయాయి. ఇక వరల్డ్ కప్ వార్మప్ మ్యాచులు కూడా వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ ప్రధాన మ్యాచులో సైతం ఈ భయం తప్పలేదు. ఆస్ట్రేలియాపై మ్యాచు సజావుగా సాగిన అంతకు ముందు రెండు చెన్నైలో భారీ  వర్షం కురవడంతో ఈ మ్యాచు కూడా రద్దవడం ఖాయమనుకున్నారు. 

ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై మ్యాచులో వర్షం పడుతుందేమో అని అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే అలాంటి  భయమేమీ అవసరం లేదని రిపోర్ట్స్ తెలుపుతున్నాయి. అహ్మదాబాద్‌లో అక్టోబర్ 14వ తేదీన వర్షం కురిసే అవకాశం లేదని IMD అంచనా వేసింది. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్‌, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉంది. భారత్ వర్సెస్ పాకిస్థాన్ ఘర్షణ రోజున సాపేక్ష ఆర్ద్రత 35%గా అంచనా వేయబడింది. 

గత రెండు రోజుల క్రితం ఇక్కడ చిరు జల్లులు పడిన సంగతి తెలిసిందే.  అయితే ఈ రోజు ప‌గ‌టి పూట ఎండ‌, మ‌బ్బులు ఉంటాయి. వ‌ర్షం ప‌డే ఛాన్సు ఒక్క శాతం మాత్ర‌మే ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ‌శాఖ నిపుణులు చెబుతున్నారు. ప‌గ‌టి పూట సుమారు 14 శాతం మేఘాలు ఉండే అవ‌కాశం ఉంది. దీంతో ఈ రోజు మ్యాచు జరగడం ఖాయంగా కనిపిస్తుంది.  కాగా.. మరి కొన్ని గంటల్లో దాయాదుల మధ్య సమరం జరగబోతుంది. నేడు (అక్టోబర్ 14) జరగబోయే మ్యాచుకు అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, సచిన్ టెండూల్కర్ హాజరు కానున్నారు. మరి లక్ష 32 వేల మంది ప్రేక్షకుల మధ్య ఎవరు గెలుస్తారో మరి కొన్ని గంటల్లో తేలనుంది.