Cricket World Cup 2023: అహ్మదాబాద్ పిచ్ రిపోర్ట్ ఇదే.. ఎంత కొడితే గెలుస్తారు..?

Cricket World Cup 2023: అహ్మదాబాద్ పిచ్ రిపోర్ట్ ఇదే.. ఎంత కొడితే గెలుస్తారు..?

భారత్, ఆస్ట్రేలియా మధ్య రేపు (నవంబర్ 19) వరల్డ్ కప్ ఫైనల్ జరగబోతుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక కానుంది. ఈ మెగా ఫైనల్ కోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. అహ్మదాబాద్ చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్ లో శ్రమిస్తున్నారు. ఎంతో గ్రాండ్ గా జరగనున్న ఈ మ్యాచ్ చూసేందుకు భారత, ఆస్ట్రేలియా ప్రధానులు స్టేడియానికి రానున్నారు. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఎన్ని ఏర్పాట్లు చేసినా అందరి దృష్టి మాత్రం పిచ్ మీదే ఉంది. ఆదివారం జరగబోయే ఈ ఫైనల్ పిచ్ రిపోర్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
 
సాధారణంగా  అహ్మదాబాద్ పిచ్ అంటే బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ వరల్డ్ కప్ లో ఇక్కడ ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో ఒక్క సారి కూడా 300 రన్స్ చేయలేకపోయాయి. ఈ సారి పిచ్ స్పిన్ కు అనుకూలించే అవకాశం ఉన్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అహ్మదాబాద్ పిచ్ పై ఛేజింగ్ కష్టం. ఈ  మైదానంలో యావరేజ్ స్కోర్ చూసుకుంటే 237గా ఉంది. 
  
"సెకండ్ బ్యాటింగ్ కష్టం కాబట్టి 315 డిఫెండబుల్ స్కోరు కావచ్చు" అని అహ్మదాబాద్ పిచ్ క్యూరేటర్ శుక్రవారం పిటిఐకి చెప్పారు. దీంతో పిచ్ క్రమంగా బ్యాటింగ్ చేయడానికి కష్టమని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో టాస్ కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ వరల్డ్ కప్ లో ఇరు జట్లు చెన్నై వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో ఆసీస్ పై నెగ్గింది.