
ప్రధానిమోదీ75వ పుట్టినరోజు సందర్భంగా..విషెస్ వెల్లువెత్తున్నాయి. ప్రపంచ దేశాల నేతలు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇటాలియన్ ప్రధాని జార్జియా మెలోని, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, యుకె మాజీ ప్రధాని రిషి సునక్ సహా అనేక మంది ప్రపంచ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ప్రధానిమోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా AI- రూపొందించిన మోదీ జీ బర్త్‌డే బాస్అని లేబుల్ చేయబడిన పుట్టినరోజు వేడుక వీడియో ఆన్‌లైన్‌లో హల్చల్ చేస్తోంది.
ఈ వీడియోలో ప్రధానిమోదీని ప్రపంచ నాయకులతో ముద్దుముద్దు చిన్నారులగా చూపించింది. ఇటాలియన్ ప్రధానమంత్రి జార్జియా మెలోని నుండి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వరకు ప్రపంచ నేతలు ఈ వీడియోలో ఆయనకు ప్రత్యేకమైన బహుమతులతో శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు కనిపిస్తోంది.
ఈ వీడియోలో మెలోని "మెలోడీ" అని రాసి ఉన్న ట్రోఫీ లాంటి గిఫ్ట్ ఇవ్వడం కనిపిస్తుంది.ప్రధానిమోదీ,ఇటలీ ప్రధాని మెలోని మధ్య స్నేహపూర్వక సంబంధం ఉంది.దీనిని సోషల్ మీడియా యూజర్లు ప్రేమగా #మెలోడీ అని పిలుస్తారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ,పుతిన్ బేబీ వెర్షన్లు బాగా ఆకట్టుకుంటున్నాయి. ట్రంప్ సుంకాల బహుమతిని, పుతిన్ S-400 క్షిపణి వ్యవస్థ బొమ్మలు బహుమతిగా ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియోలో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ,సౌదీ అరేబియా మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ కూడా ఉన్నారు.
ఈ AI వీడియోలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వంటి భారతీయ రాజకీయ నేతల చిన్నారి ఫొటోలు బాగా ఆకట్టుకున్నాయి.
మెలోని, ట్రంప్,పుతిన్,జిన్‌పింగ్ వంటి చిన్నారి ప్రపంచనేతలంగా ఒక్కదగ్గర చేరారు. సంతోషకరమైన వేడుకను సెలబ్రేట్ చేసుకునేందుకు అంటూ ఈ AI వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.. వీడియో షేర్ చేసిన యూజర్.
ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లంతా నేతలంతా చిన్నపిల్లల గెటప్ లో ముద్దుగా, అద్బుతంగా ఉన్నారంటూ లైకులు, షేర్లతో ఎంజాయ్ చేస్తున్నారు. AI టెక్నాలజీని ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఇలా వాడుకోవడం చాలా బాగుందంటున్నారు.
నేనైతే పదిసార్లు ఈ వీడియోను చూశాను. అద్భుతంగా ఉంది.. గొప్ప నేత మోదీ..ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి ఇదొక మార్గం అంటూ నెటిజన్లు ఈ వీడియో షేర్ చేసిన యూజర్ ను ప్రశంసిస్తున్నారు.