దేశంలోనే ఫస్ట్ టైం.. AI కాప్‌రైట‌ర్ యాప్ ప్రారంభం.. ఏ భాషలోనైనా కంప్లైంట్ ఇవ్వొచ్చు

దేశంలోనే ఫస్ట్ టైం.. AI కాప్‌రైట‌ర్  యాప్ ప్రారంభం.. ఏ భాషలోనైనా కంప్లైంట్ ఇవ్వొచ్చు

దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టిస్తూ...  తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత కంప్లైంట్ రికార్డర్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు హైదరాబాద్ పోలీసులు. శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతికతను వాడుకోవడంలో తామెప్పుడూ ముందే ఉంటామని మరోసారి నిరూపించారు.బ్లూక్లౌడ్ సాఫ్టెక్ సొల్యూషన్స్ సహకారంతో రూపొందించిన ఈ సరికొత్త ‘ఏఐ కాప్‌రైట‌ర్’ యాప్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆవిష్కరించారు.

ఈ యాప్ ప్రత్యేకత 

10కి పైగా భాషల్లో ఫిర్యాదులు నమోదు చేసే అద్భుతమైన సౌకర్యం ఇందులో ఉంది. బాధితులు లేదా పర్యాటకులు ఏ భాషలో మాట్లాడినా... ఆ మాటలను వెంటనే టెక్స్ట్‌గా మార్చి, అనువదించే అత్యాధునిక సాంకేతికతను ఈ యాప్‌లో అమర్చారు.

  • ఈ యాప్ పోలీస్ స్టేషన్లలో FIR నమోదు ప్రక్రియను మరింత వేగవంతం, కచ్చితం చేయనుంది.
  • బాధితుడు, సాక్షి,నిందితుల వాయిస్‌లను విడివిడిగా రికార్డ్ చేసి... వివరాలను సేకరిస్తుంది ఈ ఏఐ కాప్‌రైట‌ర్.
  • అంతేకాదు, ఫిర్యాదు వివరాలన్నీ ఆటోమేటిక్‌గా PDF రూపంలో సేవ్ అయిపోతాయి.
  • హైదరాబాద్‌లోని 80కి పైగా పోలీస్ స్టేషన్లలో ఈ యాప్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.

భాష అనేది ఎవరికీ న్యాయం జరగడానికి అడ్డంకి కాకూడదు అన్న గొప్ప లక్ష్యంతోనే ఈ AI టెక్నాలజీని వాడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా నగరానికి వచ్చే వలస కార్మికులు, పర్యాటకులు, అలాగే మహిళలు , వృద్ధులకు ఈ యాప్ ద్వారా పెద్ద ఊరట లభించనుంది. టెక్నాలజీతో నేరాలను అరికట్టడమే కాదు... ప్రజలకు సేవలను మరింత సులభతరం చేయడంలో హైదరాబాద్ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు.