మొండి బ్యాక్టీరియాకు..ఏఐ కనిపెట్టిన యాంటిబయాటిక్స్‌‌‌‌

మొండి బ్యాక్టీరియాకు..ఏఐ కనిపెట్టిన యాంటిబయాటిక్స్‌‌‌‌

కొంతమంది యాంటిబయాటిక్స్‌‌‌‌ను విపరీతంగా వాడడం వల్ల బ్యాక్టీరియా వాటికి అలవాటుపడిపోతుంది. అంటే దానిపై యాంటిబయాటిక్స్‌‌‌‌ ఎలాంటి ప్రభావం చూపించవు. అలాంటి మొండి బ్యాక్టీరియాను కూడా అంతం చేసే రెండు సరికొత్త యాంటీబయాటిక్స్‌‌‌‌ను ఏఐ ద్వారా కనిపెట్టామని సైంటిస్ట్‌‌‌‌లు వెల్లడించారు.

మసాచుసెట్స్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) సైంటిస్ట్‌‌‌‌లు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​తో తయారుచేసిన ఈ యాంటిబయాటిక్స్‌‌‌‌ని ఇప్పటికే జంతువుల మీద టెస్ట్‌‌‌‌ చేశామని చెప్పారు. అవి మందులకు లొంగని గనేరియా బ్యాక్టీరియా, ప్రమాదకరమైన మెథిసిలిన్ రెసిస్టెంట్‌‌‌‌ స్టెఫిలోకాకస్ ఆరియస్‌‌‌‌లను విజయవంతంగా చంపేశాయి. 

ఎంతో డేటా..

ఇప్పటికే అందుబాటులో ఉన్న దాదాపు 3,600 మిలియన్ కెమికల్‌‌‌‌ కాంపౌండ్స్‌‌‌‌ డేటాను ఏఐకి అందించారు. అందులో రసాయన నిర్మాణాలు, వివిధ బ్యాక్టీరియాలపై వాటి ఎఫెక్ట్‌‌‌‌ ఎలా ఉంటుంది? ఇలా అన్నిరకాల డేటా ఉంది. దాని ఆధారంగా.. ఏఐ ఇప్పటికే ఉన్న మెడిసిన్‌‌‌‌కు అతి దగ్గరగా ఉండే లేదా మనుషులకు ఎలాంటి హాని కలిగించని కాంపౌండ్స్‌‌‌‌తో కొత్త యాంటీబయాటిక్స్‌‌‌‌ని సొంతంగా తయారుచేయడం నేర్చుకుంది. 

అలా ఈ రెండు యాంటిబయాటిక్స్‌‌‌‌ని తయారుచేసింది. అయితే.. వాటిని ఇప్పుడే అందుబాటులోకి తీసుకురావడం కుదరదని, మనుషులకు ఇచ్చే ముందు మరికొన్ని పరిశోధనలు చేయాల్సి ఉంటుందని సైంటిస్ట్‌‌‌‌లు చెప్తున్నారు.