వెబ్ కోడింగ్ కోసం ఏఐ వాడుతున్నారా..? జాగ్రత్త.. ఇతనిలా రిస్క్లో పడతారు !

వెబ్ కోడింగ్ కోసం ఏఐ వాడుతున్నారా..? జాగ్రత్త.. ఇతనిలా రిస్క్లో పడతారు !

ఏఐ తెలివితేటలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. బ్రౌజర్‌‌ బేస్డ్‌‌ సాఫ్ట్‌‌వేర్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ ప్లాట్‌‌ఫాం రెప్లిట్‌‌ ఏఐ ఓ కంపెనీ లైవ్ డేటాబేస్‌‌ను పర్మిషన్‌ అడగకుండానే డిలీట్‌‌ చేసింది. అంతటితో ఆగకుండా 4 వేల మందికి పైగా నకిలీ యూజర్ల డేటాని క్రియేట్‌‌ చేసింది. ఈ విషయాన్ని ‘సాస్‌‌టీఆర్‌‌’ కంపెనీ ఫౌండర్‌‌ జేసన్‌‌ లెమ్‌‌కిన్‌‌ వెల్లడించాడు. అతను 12 రోజుల వెబ్ కోడింగ్ ప్రయోగంలో భాగంగా రెప్లిట్ ఏఐ టూల్‌‌ని వాడుతున్నాడు. తొమ్మిదో రోజు టెస్టింగ్‌‌ టైంలో లెమ్‌‌కిన్‌‌ కోడింగ్‌‌లో ఇకపై ఎటువంటి మార్పులు చేయొద్దని రెప్లిట్‌‌కి చెప్పాడు. అయినా అది ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ప్రొడక్షన్‌‌ డాటాబేస్‌‌ను యాక్సెస్‌‌ చేసింది.

కమాండ్లు ఇచ్చింది. ముఖ్యమైన డాటాబేస్‌‌ను డిలీట్ చేసింది. ఎందుకలా చేశావని లెమ్‌‌కిన్‌‌ అడిగినప్పుడు అది వైఫల్యమని అబద్ధం చెప్పింది. అందుకే రెప్లిట్‌‌ ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు చెప్తుందని, కోడ్‌‌ ఓవర్‌‌రైట్స్‌‌ చేస్తుందని, అక్కడితో ఆగకుండా ఫేక్‌‌ డాటాను క్రియేట్‌‌ చేస్తుందని అతను ఆరోపించాడు. ఈ విషయం తెలిశాక లెమ్‌‌కిన్‌‌కు రెప్లిట్ సీఈవో అమ్జాద్ మసాద్ క్షమాపణ చెప్పాడు. 

రెప్లిట్ అనేది జోర్డాన్ ప్రోగ్రామర్లు అమ్జాద్ మసాద్, ఫారిస్ మసాద్, డిజైనర్ హయా ఓడెహ్ 2016లో స్థాపించిన ఒక అమెరికన్ టెక్నాలజీ కంపెనీ. దీన్ని యూజర్లు బ్రౌజర్‌‌లోనే అప్లికేషన్లను రాయడానికి, రన్ చేయడానికి, డీబగ్ చేయడానికి వాడతారు. కోడర్లు  ప్రాథమికంగా తాము ఏం నిర్మించాలి అనుకుంటున్నారో సరళమైన భాషలో వివరిస్తారు.  ఏఐ దానిని ఎక్జిక్యూటబుల్ కోడ్‌‌గా మారుస్తుంది. 

మరిన్ని వార్తలు