- 14 లొకేషన్లలో కెమెరాలు
- రాంగ్‌వే డ్రైవింగ్, లేన్ వయలేషన్, రాంగ్‌పార్కింగ్ గుర్తింపు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: ఔటర్ రింగ్ రోడ్‌పై ప్రమాదాల నివారణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోబోతోంది. హైస్పీడ్, డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఓఆర్ఆర్పై తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్టు తేలడంతో నివారణ చర్యలు ప్రారంభించింది. ఒక్కో లేన్‌పై ఒక్కో వేగంతో వెళ్లడానిక అవకాశం ఉన్నా ఇష్టారాజ్యంగా డ్రైవింగ్ చేయడం, అనుమతి లేకున్నా వాహనాల పార్కింగ్తో యాక్సిడెంట్లు జరిగి మరణాలు సంభవిస్తున్నాయి.
దీని నివారణకు హైదరాబాద్గ్రోత్కారిడార్ లిమిటెడ్(హెచ్‌జీసీసీ), సైబరాబాద్పోలీసులు సంయుక్తంగా 24 గంటలపాటు నిఘా ఉంచేందుకు ఏఐ ఆధారిత మల్టీ వయలేషన్డిటెక్షన్సిస్టమ్అమలు చేయనున్నారు. ఇందులోని ఎలక్ట్రానిక్మానిటరింగ్అండ్ఎన్ఫోర్స్మెంట్సిస్టమ్(ఈఎంఈఎస్) విధానం ద్వారా ప్రమాదాలు తగ్గుతాయని, అలాగే దానికి కారకులను సులభంగా గుర్తించడానికి అవకాశం ఉంటుందంటున్నారు.
14 లొకేషన్లలో..
ఓఆర్ఆర్పరిధి158 కి.మీ మేరకు విస్తరించి ఉంది. ఈ రోడ్డుకు 25 ఎగ్జిట్పాయింట్లున్నాయి. ఈ మేరకు ఓఆర్ఆర్పొడవునా14 ముఖ్యమైన లొకేషన్లలో సింగిల్ కెమెరా టెక్నాలజీ ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా 24 గంటల పాటు వాహనాల రాకపోకలను, డ్రైవర్ల డ్రైవింగ్తీరును గుర్తించడానికి అవకాశం ఉంటుంది. వాహనాల డ్రైవర్లు నిబంధనలు పాటిస్తున్నారా? లేదా? అన్నది కూడా ఈ కెమెరాల ద్వారా స్పష్టంగా తెలుస్తుందంటున్నారు.
ముఖ్యంగా వాహనాల స్లో, స్పీడ్ మూవ్మెంట్(డే అండ్‌నైట్) ను స్పష్టంగా గుర్తించడానికి వీలుంటుంది. రాంగ్‌వే డ్రైవింగ్, లేన్డిసిప్లిన్వయలేషన్, రివర్స్డ్రైవింగ్, సీట్‌బెల్ట్ పెట్టుకోకపోవడం, మొబైల్‌ఫోన్ ఉపయోగించడం, పార్కింగ్చేయడం వంటివన్నీ నేరుగా మానిటర్చేసేందుకు అవకాశం ఉంటుంది.
ఓఆర్ఆర్పై 14 ప్రాంతాల్లో ఈ సిస్టమ్ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే సైబరాబాద్కమిషనరేట్నుంచి హెచ్ఎండీఏకు (హెచ్‌జీసీసీ)కి ప్రతిపాదనలు అందాయి. ఎంపిక చేసిన ప్రాంతాల్లో సర్వేలెన్స్ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా నిబంధనలు పాటించని వాహన దారులకు ఛలానాలు వేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
రూ. 8.34 కోట్లతో ప్రతిపాదనలు
సైబరాబాద్పోలీసులు ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన హెచ్ఎండీఏ ఈ ప్రాజెక్టు నిర్వహణను ప్రైవేట్ఏజెన్సీ ద్వారా చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రాజెక్ట్డిజైన్, మెయింటెన్స్‌పై సదరు సంస్థ డీపీఆర్అందించనుంది.
సైబరాబాద్ పరిధిలో 0 నుంచి 23.78 కి.మీ. 43 కి.మీ. నుంచి 72 కి.మీ, 121 కి.మీ. నుంచి158.16 కి.మీగా ప్రాజెక్టును విభజించి ఆరు నెలల్లో పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.8.34 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు.
ఎలా పని చేస్తుందటే..
ఈ ప్రాజెక్టులో వినియోగించే కెమెరాలతో ఆటోమేటిక్నెంబర్ప్లేట్రికగ్నిషన్, మోడల్, క్లాసిఫికేషన్‌ను ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా గుర్తించి ఈ–చలానాలు వేసేందుకు అవకాశం ఉంటుందంటున్నారు. ఈ మొత్తం ప్రాసెస్‌ను ఇంటిగ్రేటెడ్కంట్రోల్ రూమ్ద్వారా పర్యవేక్షించనున్నారు.
ఈ టెక్నాలజీ ద్వారా ఏ ప్రాంతంలో అనధికార పార్కింగ్ఉన్నా అలర్ట్ చేసి పెట్రోలింగ్టీమ్కు సందేశం పంపుతుందంటున్నారు. వాహనా స్లో మూవ్మెంట్గుర్తించి చెప్తుందని, ప్రమాదాలు జరిగితే అంబులెన్స్‌లను అలర్ట్ చేసే టెక్నాలజీ కలిగి ఉంటుందంటున్నారు.
అన్ని సీసీకెమెరాలు సమాచారాన్ని ఎప్పటికప్పుడు నానక్‌రామ్‌గూడలో నిర్మించే మాస్టర్ట్రాఫిక్కంట్రోల్ సెంటర్(ఎంటీసీసీ)కి బంజారాహిల్స్‌లోని కమాండ్కంట్రోల్సెంటర్(సీసీసీ)కి అనుసంధానం చేస్తారు. ఈ ప్రాజెక్టును చేపట్టడానికి త్వరలోనే బిడ్డర్లను ఆహ్వానించనున్నట్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత రాచకొండ కమిషరేట్పరిధిలోని ఓఆర్ఆర్లొకేషన్లలో కూడా అమలు చేయనున్నట్టు అధికారులు తెలిపారు.
