
ఏఐ సెర్చ్ ఇంజిన్ పర్‌ప్లెక్సిటీ ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ ప్లాట్‌ఫాం వీడియోలు క్రియేట్ చేసుకునే ఫీచర్ తీసుకొచ్చింది. కేవలం టెక్స్ట్ ప్రాంప్ట్‌తో వీడియో క్లిప్‌లు క్రియేట్ చేయడానికి ఈ ఫీచర్ యాడ్ చేసింది. అయితే పర్‌ప్లెక్సిటీ ప్రొ, మ్యాక్స్ సబ్స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అలాగే యూజర్లు దీన్ని వాడాలంటే వాళ్ళ మొబైల్ యాప్‌ను అప్డేట్ చేయాలి.
ప్రాంప్ట్ బాక్స్‌లో ‘జనరేట్ ఎ వీడియో ఆఫ్....’ అని మీకు నచ్చిన వీడియోను క్రియేట్ చేయమని ప్రాంప్ట్ ఇవ్వాలి. ప్రాంప్ట్ ఇచ్చిన కొద్దిసేపటికి 8 సెకండ్ల వీడియో జనరేట్ అవుతుంది. ఒకవేళ ఆ వీడియో నచ్చకపోయినా, ఫిల్టర్స్ వాడాలన్నా, ఎడిట్ చేయాలన్నా మళ్లీ ప్రాంప్ట్ ఇవ్వాలి. ఇచ్చిన ప్రాంప్ట్‌ను బట్టి వీడియో క్రియేట్ చేసి ఇస్తుంది. ఆ వీడియోను డౌన్లోడ్ చేసి షేర్ చేసుకోవచ్చు. అంతేకాదు.. వీడియోలో అనుచిత కంటెంట్ ఉంటే రిపోర్ట్ చేయొచ్చు.