ఎయిర్టెల్ నుంచి ఏఐ సర్వీసులు

ఎయిర్టెల్ నుంచి ఏఐ సర్వీసులు

హైదరాబాద్​, వెలుగు: -స్కైలార్క్ పేరుతో ఏఐ/ఎంఎల్ పవర్డ్ క్లౌడ్- ఆధారిత లొకేషన్ సేవను ప్రారంభించడానికి ఎయిర్​టెల్​ బిజినెస్, స్విఫ్ట్ నావిగేషన్​తో చేతులు కలిపింది.   స్కైలార్క్ టెక్నాలజీని ఎయిర్టెల్ పాన్-ఇండియా 4జీ/5జీ నెట్‌‌వర్క్‌‌తో కలిపి, మిషన్- క్రిటికల్ లొకేషన్- ఆధారిత అప్లికేషన్‌‌ల కోసం వాడుతారు. 

సెంటీమీటర్ -స్థాయి కచ్చితమైన పొజిషనింగ్ ప్లాట్‌‌ఫారమ్‌‌ను ఇది అందిస్తుంది. అంటే లొకేషన్​ను చాలా కచ్చితంగా తెలుసుకోవచ్చు. జీపీఎస్ కంటే ఇది 100 రెట్లు ఎక్కువ కచ్చితంగా పనిచేస్తుంది.ఇది ఎమర్జెన్సీ రెస్పాన్స్​, ఆటానమస్ మొబిలిటీ, శాటిలైట్-ఆధారిత టోల్ వసూళ్లు, డిజిటల్ మ్యాపింగ్ వంటి వాటిని సులభతరం చేస్తుంది.