AI దేవుళ్లు ఇలా ఉంటారు.. కొత్త అవతారాలు

AI దేవుళ్లు ఇలా ఉంటారు.. కొత్త అవతారాలు

ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) మాట ఎక్కువుగా కనపడుతుంది.   రోబోలు పనిచేయడం... రోబోలు వార్తలు చదవడం ఇలా విన్నాం.  ఇక రోబో దేవుళ్లు కూడా రాబోతున్నారు. హిందువులు మొదటిగా పూజించే విఘ్నేశ్వరుడు రోబోలో ఉంటే ఎలా ఉంటాడో  @wild.trance Instagram పేజీలో పోస్ట్ చేశారు.  ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  చాలామంది గణపతి బొప్ప మోరియా అని కామెంట్లు పెట్టారు.  సైబర్‌పంక్ స్టైల్‌లో వినాయకుడు దుస్తులు ధరిస్తే  ఎలా కనిపిస్తాడో ఊహిస్తూ ఫొటోను పోస్టు చేశారు. 

ఇక బం బం బోలే అంటూ శివుడి  చిత్రాన్ని కూడా పోస్టు చేశారు.   AI శివుడి విగ్రహం  తయారు చేస్తే   బంబం బోలే అంటూ ప్రశాంతంగా కూర్చున్న భంగిమలో శివుడు ఉండే విగ్రహం నమూనా సోషల్ మీడియాలో వైరల్ అయింది.   సైబర్‌పంక్ పద్ధతిలో హరే కృష్ణ అంటూ AI శ్రీకృష్ణుడి రూపం కూడా  సోషల్ మీడియాలో పోస్ట్ అయింది. జై బజరంగ బలి అంటూ  హనుమంతుడి  రెండు చిత్రాలను , ఇంకా   పొడవాటి గడ్డంతో ఉన్న బ్రహ్మ దేవుడి AI విగ్రహాలు వైరల్ అవుతున్నాయి.  అంటే భవిష్యత్తులో రోబో దేవుళ్లు కూడా వస్తారని చర్చ జరుగుతుంది.