
హైదరాబాద్, వెలుగు: ప్రపంచవ్యాప్తంగా బ్యాంకుల ఆధునీకరణను వేగవంతం చేయడానికి హెచ్‌సీఎల్‌టెక్, థాట్ మెషీన్ కంపెనీలు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. దీనివల్ల బ్యాంకులు ఏఐ, క్లౌడ్ టెక్నాలజీతో పనిచేసే అధునాతన ఆర్థిక సంస్థలుగా మారతాయి. ఈ మార్పునకు థాట్ మెషిన్‌కు చెందిన 'వాట్ ప్లాట్‌ఫారమ్' కీలకం కానుంది. హెచ్‌సీఎల్‌టెక్ తన నైపుణ్యంతో బ్యాంకింగ్ టెక్నాలజీ, నియంత్రణ నిబంధనలు, క్లిష్టమైన ఇంటిగ్రేషన్లలో సహాయం చేస్తుంది.
ఈ సహకారం ద్వారా బ్యాంకులు కొత్త ప్రాడక్ట్స్‌ను వేగంగా లాంచ్ చేయవచ్చు. ఈ పార్ట్నర్షిప్ అమలుకు హెచ్‌సీఎల్‌టెక్ ఒక ప్రత్యేక సీఓఈని కూడా నియమించనుంది. ఇది బ్యాంకింగ్ రంగానికి రియల్ టైం, స్కేలబుల్ సొల్యూషన్లను అందిస్తుంది. ఈ భాగస్వామ్యం బ్యాంకింగ్ రంగాన్ని మరింత పటిష్టంగా, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండేలా చేస్తుందని హెచ్‌సీఎల్ తెలిపింది.