
మనిషి చేసే ప్రతి పనిలో ఏదో ఒక విధంగా సాయం చేయడానికి ఏఐ రెడీ అవుతోంది. ముఖ్యంగా కొన్నాళ్ల నుంచి వైద్య రంగంలో ఎంతో ఉపయోగపడుతోంది. డాక్టర్లు ట్రీట్‌మెంట్స్, సర్జరీలకు ఏఐ ఆధారిత రోబోటిక్ వ్యవస్థలను వాడుతున్నారు. కానీ.. ఇప్పుడు కేవలం సెల్ఫీతోనే మనిషి ఆరోగ్యాన్ని అంచనా వేస్తోంది ‘ఫేస్ ఏజ్’ అనే ఏఐ టూల్. ఇది బయోలాజికల్ ఏజ్‌ని గుర్తించి, పేషెంట్లకు క్యాన్సర్ తగ్గే అవకాశాలను కూడా అంచనా వేస్తోంది.
ఒక వ్యక్తికి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు డాక్టర్లు ట్రీట్మెంట్ చేసే ముందు వయసు అడుగుతారు. ఎందుకంటే.. వయసును బట్టి బాడీ తట్టుకునే మెడిసిన్ డోస్‌ని ఇస్తారు. ట్రీట్మెంట్కి బాడీ ఎలా తట్టుకుంటుందనేది అంచనా వేస్తారు. కొందరి వయసు చిన్నదే అయినా చూడడానికి చాలా పెద్దవాళ్లలా కనిపిస్తారు. అలాంటివాళ్లకు కొన్నిరకాల ట్రీట్‌మెంట్స్ చేసేటప్పుడు వయసుని పరిగణనలోకి తీసుకోకుండా వాళ్ల బయోలాజికల్ ఏజ్‌ని అంచనా వేస్తారు డాక్టర్లు.
►ALSO READ | Happy Mother’s Day 2025: కనిపించే దైవం అమ్మ..ఎందుకంటే.?
బయోలాజికల్ ఏజ్ అనేది మనిషి ఆహారపు అలవాట్లు, జెనెటిక్స్, లైఫ్‌స్టైల్, పర్యావరణ పరిస్థితులు.. ఇలా ఎన్నో అంశాలమీద ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో అసలైన వయసు కంటే బయోలాజికల్ ఏజ్ తక్కువగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఉన్న వారిలో ఎక్కువగా ఉంటుంది. అయితే.. ఏఐ సాయంతో ఆ ఏజ్‌ని ఇప్పుడు కేవలం ఒక్క సెల్ఫీతో తెలుసుకోవచ్చు.
ట్రైనింగ్
‘ఫేస్ ఏజ్’కి దాదాపు 59,000 ఆరోగ్యకరమైన వ్యక్తుల ఫొటోలతో ట్రైనింగ్ ఇచ్చారు. దానివల్లే క్యాన్సర్ రోగుల సర్వైవల్ అవకాశాల విషయంలో ఇది డాక్టర్ల కంటే కచ్చితంగా అంచనా వేయగలదు. డాక్టర్లు ఫేస్ ఏజ్‌ను ఉపయోగించి పాలియేటివ్ రేడియోథెరపీ చేయించుకుంటున్న రోగుల సర్వైవల్ని అంచనా వేశారు. దానివల్ల గతంతో పోలిస్తే.. కచ్చితత్వం 61% నుండి 80%కి పెరిగింది.
క్యాన్సర్ చికిత్సకు...
ఫేస్ ఏజ్ టూల్ సెల్ఫీల్లో చర్మ ఆకృతి, ముఖం మీద ఉండే రేఖల ద్వారా బయోలాజికల్ ఏజ్‌ని గుర్తిస్తుంది. అంతేకాదు.. ఆ వ్యక్తి క్యాన్సర్ చికిత్సకు ఎంత బాగా రెస్పాండ్ అవుతాడో అంచనా వేస్తుంది. మాస్ జనరల్ బ్రిగమ్ పరిశోధకులు ఈ ఏఐ టూల్‌ని డెవలప్ చేశారు. ఇది ఒక వ్యక్తి ఆరోగ్యానికి సంబంధించి చాలా సమాచారం ఇవ్వగలదు. 6,000 కంటే ఎక్కువ మంది క్యాన్సర్ రోగులను ఈ టెక్నాలజీని వాడి పరీక్షించారు.
►ALSO READ | ఒత్తిడి పెరిగే కొద్ది సమస్యలు.. హైపర్ టెన్షన్ అవ్వొద్దు!
సాధారణంగా క్యాన్సర్ ఉన్న రోగులు వాళ్ల అసలు వయసుకంటే దాదాపు 5 సంవత్సరాలు పెద్దవాళ్లలా కనిపిస్తారని పరిశోధనలో తేలింది. కానీ.. కొందరి ఏజ్ మాత్రం రకరకాల కారణాల వల్ల తక్కువగా కూడా ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి వయసు 75 సంవత్సరాలు అనుకుందాం. కానీ... అతని బయోలాజికల్ ఏజ్ ఐదేళ్లు తక్కువగా ఉంది. అలాంటప్పుడు ఆ వ్యక్తి చికిత్సను బాగా తట్టుకుంటాడు. అతని బాడీ ట్రీట్మెంట్కి తొందరగా రెస్పాండ్ అవుతుంది.