18న రాష్ట్రానికి మల్లికార్జున్ ఖర్గే

18న రాష్ట్రానికి మల్లికార్జున్ ఖర్గే

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణతోపాటు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 18న ఖర్గే రాష్ట్రానికి రావొచ్చని తెలుస్తోంది. 13న చత్తీస్ గఢ్​లోని రాయ్ పూర్​లో నిర్వహించే ర్యాలీతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. 18న తెలంగాణ, 22న మధ్యప్రదేశ్ లోని భోపాల్, 23న రాజస్థాన్​ లోని జైపూర్ లో ఖర్గే పర్యటించనున్నట్లు వెల్లడించాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల సమీక్ష సమావేశాలను ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం పూర్తి చేసింది. ఆయా రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై స్థానిక నేతలతో ఖర్గే, రాహుల్ చర్చించారు. రాష్ట్రంలో ఖర్గే పర్యటన అనంతరం రాహుల్, ప్రియాంక పర్యటన కూడా ఉండొచ్చని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి.