ఆర్మీని ప్రధాని మోసం చేశారు : కల్నల్ హరీశ్ చౌదరి

ఆర్మీని ప్రధాని మోసం చేశారు : కల్నల్ హరీశ్ చౌదరి

హైదరాబాద్, వెలుగు: దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులపై ప్రధాని మోదీ గత పదేండ్లుగా వివక్ష చూపిస్తున్నారని ఏఐసీసీ ఎక్స్ సర్వీస్ మెన్ వింగ్ నేత కల్నల్ హరీశ్  చౌదరి ఆరోపించారు.  వన్ నేషన్, వన్ పెన్షన్ ఇస్తానని ఆర్మీని మోసం చేశారని, ఆ పాలసీని పూర్తిగా తొలగించారని వెల్లడించారు. 

శనివారం ఆయన గాంధీ మీడియాతో మాట్లాడారు. మోదీ ప్రభుత్వం అగ్ని పథ్ పేరుతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేపడుతోందని,  అగ్నివీర్ కాంట్రాక్టు సైనికులను రెగ్యులర్ చేయట్లేదని ఆరోపించారు. దీని వల్ల జవాన్లు ఎన్నో బెనిఫిట్స్ కోల్పోతున్నారని తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆర్మీకి అన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయని వివరించారు. పేద బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ మద్దతుగా ఉందని తెలిపారు.