31 నుంచి మీనాక్షి పాదయాత్ర.. 7 రోజులు 6 నియోజకవర్గాలు

31 నుంచి మీనాక్షి పాదయాత్ర.. 7 రోజులు 6 నియోజకవర్గాలు
  • పరిగి నుంచి షురూ చేయనున్న ఇన్ చార్జి
  • ఈ నెల 31 నుంచి 6వ తేదీ వరకు షెడ్యూల్
  • ప్రతి సెగ్మెంట్ లో 8 నుంచి10 కి.మీ పాదయాత్ర
  • ప్రతి ఉమ్మడి జిల్లాలోని ఒక సెగ్మెంట్ లో బస
  • శ్రమదానం కూడా చేయనున్న ఏఐసీసీ ఇన్ చార్జి
  • పరిగి, అందోల్, ఆర్మూర్, ఖానాపూర్, చొప్పదండి, వర్ధన్నపేట సెగ్మెంట్లు ఫైనల్

హైదరాబాద్: ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ రాష్ట్రంలోని ఆరు నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయనున్నారు. ఇందుకోసం రూట్ మ్యాప్ సైతం సిద్ధమైంది. ప్రజలతో మమేకం కావడంతోపాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోనున్నారు. ఈ క్రమంలో శ్రమదానం కూడా చేయనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన జైభీమ్, జై బాపూ, జై సంవిధాన్ పై నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని మీనాక్షి భావిస్తున్నరని తెలుస్తోంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశగా ఆమె ప్లాన్ చేస్తున్నారు.  

పార్టీ గ్రామ, మండల నాయకుల మధ్య, మండల,నియోజకవర్గ నేతల మధ్య సమన్వయం నెలకొల్పేందుకు ఆమె కృషి చేయనున్నారు. ప్రజలతో మమేకమైన క్రమంలో ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరును కూడా ఆమె స్వయంగా అడిగి తెలసుకోనున్నారని సమాచారం.  ఇవాళ సాయంత్రం ఆమె హైదరాబాద్ చేరుకోనున్నారు. మీనాక్షి 15 రోజుల పాటు రాష్ట్రంలోనే ఉండనున్నారు.  రేపు ఉదయం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తో సమావేశమవుతారు. 

►ALSO READ | అప్పుడు కేసీఆర్ అని.. ఇప్పుడు సీఎం రేవంత్ అంటూ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో RS ప్రవీణ్ కుమార్ U టర్న్

అనంతరం ఉమ్మడి జిల్లాల పార్టీ ఇన్ చార్జీలతో ఎమ్మెల్యే  క్వార్టర్స్ లో వన్ టు వన్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 31 నుంచి ఏడు రోజుల పాటు ఆమె జిల్లాల్లో పర్యటిస్తారని సమాచారం. తొలుత పరిగి సెగ్మెంట్  నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. తొలి దపాలో పరిగి, అందోల్, ఆర్మూర్, ఖానాపూర్, చొప్పదండి, వర్ధన్నపేట సెగ్మెంట్లలో పర్యటిస్తారు.  ప్రతి ఉమ్మడి జిల్లాలోని ఒక నియోజకవర్గంలో పాదయాత్రతో పాటు రాత్రి బస చేయాలని ఆమె భావిస్తున్నారు. ఇలా రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాలను కవర్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. .