అప్పుడు కేసీఆర్ అని.. ఇప్పుడు సీఎం రేవంత్ అంటూ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో RS ప్రవీణ్ కుమార్ U టర్న్

అప్పుడు కేసీఆర్ అని.. ఇప్పుడు సీఎం రేవంత్ అంటూ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో RS ప్రవీణ్ కుమార్  U టర్న్

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యూటర్న్ తీసుకున్నారు. గతంలో బీఎస్పీ పార్టీలో ఉన్నప్పుడు.. BRS ఫోన్ ట్యాపింగ్ చేస్తోందని, KCR తన ఫోన్ ట్యాప్ చేయిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు పై పంజాగుట్ట పీఎస్ లో నమోదైన FIR పై సోమవారం (జులై 28) RS ప్రవీణ్ కుమార్ నుండి వాంగ్మూలం తీసుకున్నారు సిట్  అధికారులు. 

సిట్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చిన ప్రవీణ్ కుమార్.. ఫోన్ ట్యాప్ అయినట్లు ఆపిల్ మొబైల్ కి అలర్ట్ మెసేజ్ రావడం తో గతంలో ఫిర్యాదు చేశానని తెలిపారు. అప్పట్లో BRS ప్రభుత్వం, KCR పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన ప్రవీణ్ కుమార్.. ఫోన్ ట్యాపింగ్ ను BRS రాజకీయంగా వాడుకోలేదని ఇప్పుడు మాట మార్చారు. సిట్ అధికారుల ఎదుట BRS కు అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చారు. 

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇచ్చిన అప్పటి ఫిర్యాదు పై వాంగ్మూలం ఇవ్వమంటే , సీఎం రేవంత్ రెడ్డి పై ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు , తన ఫోన్ ట్యాప్ చేయిస్తున్నట్లు సిట్ కు ఫిర్యాదు చేశారు. డార్క్ వెబ్ సైట్ లో టూల్స్ ఉపయోగించి ప్రైవేటు వ్యక్తుల తో ఫోన్ ట్యాప్ చేయిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ను పావుగా వాడుకుంటుందని ఈ సందర్భంగా ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు ప్రవీణ్ కుమార్.