సమష్టిగా పనిచేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి : రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

సమష్టిగా పనిచేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి : రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
  • ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి 

తుంగతుర్తి, వెలుగు: గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కమిటీ ఎన్నుకున్న సర్పంచ్ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి  సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ఆయన నివాసంలో కార్యకర్తలతో కలిసి మాట్లాడారు. సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ స్థానాలు గెలవనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.

 గ్రామాల్లో సర్పంచులు, ఎన్నిక కోసం కార్యకర్తలు నాయకులు ఐకమత్యంతో పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్, కాంగ్రెస్  నాయకులు  కడారు యాదవ రెడ్డి, , అరుణ్ కుమార్ ,సంకినేని గోవర్ధన్ రావు, మేనేని మాధవరావు  రాంబాబుకొండరాజు తదితరులు పాల్గొన్నారు.