ఇయ్యాల, రేపు (జూలై 15,16న) బెంగళూరులో..ఏఐసీసీ ఓబీసీ సలహా మండలి సమావేశాలు

ఇయ్యాల, రేపు (జూలై 15,16న) బెంగళూరులో..ఏఐసీసీ ఓబీసీ సలహా మండలి సమావేశాలు
  • రాష్ట్రం నుంచి ఏడుగురికి చోటు​

హైదరాబాద్, వెలుగు: ఏఐసీసీ ఓబీసీ సలహా మండలి సమావేశాలు మంగళవారం నుంచి రెండు రోజుల పాటు బెంగుళూరులో జరగనున్నాయి. దేశ వ్యాప్తంగా ఓబీసీల సమస్యలు, వాటి పరిష్కారం, ఈ వర్గాల విషయంలో మోదీ సర్కార్ అవలంభిస్తున్న విధానాలపై ఇందులో ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశాలకు తెలంగాణ నుంచి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ మధు యాష్కీ తదితరులు పాల్గొననున్నారు. తెలంగాణ రాష్ట్రంలో విజయంతంగా పూర్తి చేసిన కులగణన, 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుపై ఇందులో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ప్రసంగించనున్నారు.