ఎస్సీ వర్గీకరణపై కమిటీల పేరుతో టైంపాస్​ : సంపత్​ కుమార్​

ఎస్సీ వర్గీకరణపై కమిటీల పేరుతో టైంపాస్​ :  సంపత్​ కుమార్​

హైదరాబాద్, వెలుగు: కమిటీల పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై కాలక్షేపం చేస్తున్నదని ఏఐసీసీ కార్య దర్శి సంపత్​ కుమార్​ విమర్శించారు. దళితులను మోసం చేసేందుకే మరోసారి కమిటీ అంటూ డ్రామాలు ఆడుతున్నదన్నారు. శనివారం ఆయన గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై అన్ని రాష్ట్రాల్లోనూ ఉద్యమం జరిగిందని, ఉమ్మడి ఏపీలో 2004లో ఆనాటి కాంగ్రెస్​ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసిందని గుర్తు చేశారు. 

ఆ వెంటనే నాటి యూపీఏ చైర్​పర్సన్​ సోనియా గాంధీకి అఖిలపక్షాలన్నీ వెళ్లి తీర్మానం కాపీని అందజేశాయని, ఆమె ఆమోదించడంతో ప్రభుత్వం ఉషా మెహ్రా కమిటీ వేసిందని చెప్పారు. 2008లో కమిటీ రిపోర్ట్​ఇచ్చినా.. నాటి ఉద్యమ పరి స్థితుల నేపథ్యంలో కమిటీ సిఫార్సులు అమలు కాలేదని చెప్పారు. రాష్ట్రాలకు స్వేచ్ఛనిచ్చేలా రిపోర్లులో పేర్కొన్నారని గుర్తుచేశారు. 

అయితే, ఆ తర్వాత అధికారం లోకి వచ్చిన బీజేపీ సర్కారు.. ఉషా మెహ్రా కమిటీ రిపోర్ట్​ ఆధారంగా ఎస్సీ వర్గీకరణ చేసేందుకు అవకాశం ఉన్నా చేయలేదని విమర్శించారు. పది నిమిషాల్లో చేయతగి న పనిని.. పదేండ్లవుతున్నా పూర్తి చేయలే దని మండిపడ్డారు. లోక్​సభ ఎన్నికల వేళ మళ్లీ కమిటీల పేరుతో డ్రామాలు ఆడుతున్నదన్నారు. కేంద్రానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ వర్గీకరణను అమలు చేసి దళితులపై ప్రేమ చూపించాలన్నారు.