కేసీఆర్ ను ఇంటికి పంపండి. . .దళిత బంధు పేరుతో రాజకీయాలు

కేసీఆర్ ను ఇంటికి పంపండి. . .దళిత బంధు పేరుతో  రాజకీయాలు

జగిత్యాలలో ఏఐసిసి రాష్ట్ర కార్యదర్శి నదిమ్ జావెద్ పర్యటించారు.  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటి వెళ్లిన ఆయనకు స్థానిక కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు.  తెలంగాణలో సీఎం కేసీఆర్  దళిత బంధు పేరిట రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.  తెలంగాణలోని అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందన్నారు. కర్ణాటక ప్రజలు మతతత్వ రాజకీయాలను  తిరస్కరించినట్లే...  తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను కూడా సాగనంపాలని ఏఐసిసి రాష్ట్ర కార్యదర్శి నదిమ్ జావెద్ అన్నారు. 

ప్రజలను మభ్య పెట్టడంలో సీఎం కేసీఆర్ ను మించిన నాయకులు లేరని  ప్రపంచంలో లేరని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు.  బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులను ఏ విధంగా దగా చేస్తుందో ఆయన బహిరంగ లేఖ విడుదల చేశారు.  2022-23లో దళిత బంధు పథకానికి బడ్జెట్ లో 17 వేల 700 కోట్లు కేటాయించినా ఇంతవరకు ఏ ఒక్కరికి దళిత బంధు పథకం ఇవ్వలేదని  మండిపడ్డారు.