దేశంలో సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పోరాడుతుంది: మీనాక్షి నటరాజన్

దేశంలో సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పోరాడుతుంది: మీనాక్షి నటరాజన్

హైదరాబాద్: దేశంలో సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్​ పోరాటం చేస్తోందన్నారు ఏఐసీసీ ఇంఛార్జీ మీనాక్షి నటరాజన్. కాంగ్రెస్​ తోనే సామాజిక న్యాయం జరుగుతుంది..దేశంలో సామాజిక న్యాయం కోసం రాహుల్​ గాంధీ పోరాటం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ, 42 బీసీ రిజర్వేషన్లు బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసింది ఒక్క కాంగ్రెస్సే అన్నారామె. 

జూబ్లీహిల్స్​ఉపఎన్నికలో కాంగ్రెస్​అభ్యర్థిని గెలిపించేందుకు ఐక్యంగా కృషి చేయాలన్నారు. ప్రతిఒక్క కార్యకర్త ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయాలన్నారు.  తెలంగాణలో సీఎం రేవంత్​ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్​ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తున్నారు. పేదలకు అనేక ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు మీనాక్షీ నటరాజన్​. 

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత కరెంట్, ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారని అన్నారు. ఇంకా  కాంగ్రెస్​ ప్రభుత్వం రాబోయే మూడేళ్లలో అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టబోతోందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నంటిని పూర్తి చేస్తుందన్నారు.