ఎయిడ్స్ కంట్రోల్ కాంట్రాక్ట్ ఉద్యోగులను విలీనం చేయాలి

ఎయిడ్స్ కంట్రోల్ కాంట్రాక్ట్ ఉద్యోగులను విలీనం చేయాలి

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని హెచ్ఐవీ, ఎయిడ్స్ కంట్రోల్ కాంట్రాక్ట్ ఉద్యోగులను హెల్త్ డిపార్ట్​మెంట్​లో విలీనం చేయాలని స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టి.శివప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

గురువారం బాగ్​లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. శివప్రసాద్ మాట్లాడుతూ.. 800 మందికి పైగా ఉద్యోగులు కాంట్రాక్ట్​ పద్ధతిన 20 ఏండ్లుగా రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని సొసైటీగా ఉన్న ఎయిడ్స్ కంట్రోల్​ను హెల్త్ డిపార్ట్  మెంట్ లో విలీనం చేయాలని కోరారు. కార్యక్రమంలో రంజిత్ కుమార్, శ్రీదేవి, నాగరాజు, నరేందర్, శ్యాంసుందర్, నాగమణి, సతీశ్, రవి తదితరులు పాల్గొన్నారు.