
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రసాదం లడ్డూలను అసెంబ్లీ ఆవరణలో పంపిణీ చేశారు. ప్రజాప్రతినిధుకు, జర్నలిస్టులకు అందించారు. లక్ష్మీ నరసింహస్వామి కృపతో రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసిందని అన్నారు. ఈ క్రమంలో అటు వైపు వచ్చిన మాజీ మంత్రి మల్లారెడ్డికి కూడా లడ్డూ ప్రసాదాన్ని అందించారు ఐలయ్య.