హిందూ దేశంగా మార్చాలని చూస్తున్నరు

హిందూ దేశంగా మార్చాలని చూస్తున్నరు

    మేమంతా ఇండియన్​ ముస్లింలం

    ఎక్కడ పుట్టామంటే ఎట్ల చెప్పేది : ఎంపీ అసదుద్దీన్​ ఒవైసీ

కాగజ్​నగర్, బెల్లంపల్లి, వెలుగు: భారతదేశంలో మత ప్రాతిపదికన చట్టాలు చేస్తూ హిందూ దేశంగా మార్చాలని బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర సర్కార్​ ప్రయత్నిస్తోందని ఏఐఎంఐఎం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్​ ఒవైసీ అన్నారు. ఎన్నార్సీ, సీఏఏ, ఎన్​పీఆర్​అమలైతే దేశంలోని ముస్లిం, మైనార్టీలు, పేదలు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోక తప్పదని తెలిపారు. కొమ్రం భీం జిల్లా కాగజ్​నగర్, బెల్లంపల్లి లో గురువారం మున్సిపల్​ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. దేశంలోని ముస్లింలంతా ఇండియన్​ ముస్లింలేనని స్పష్టం చేశారు. దేశంలో ఆందోళనలను ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్​షా గుర్తించకుండా తామే రైటన్నట్లు ముందుకు వెళ్లడం సరికాదన్నారు. ఎన్నార్సీ అమలైతే ముస్లిం అంటే గిట్టని ఆఫీసర్లు అడిగే ప్రశ్నలకు జవాబు ఇవ్వలేని దుస్థితి ఉంటుందని అన్నారు. దేశంలో కనీసం 40 శాతం మంది ముస్లింల వద్ద బర్త్​సర్టిఫికెట్లు లేవని తెలిపారు. ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులను గెలిపిస్తే తమ పనితీరు చూపిస్తామన్నారు.

వెలుగు మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి