ఎంఐఎం నేతల రేవ్ పార్టీ.. మందేసి చిందులు

ఎంఐఎం నేతల రేవ్ పార్టీ..  మందేసి చిందులు

పాతబస్తీలోని చంద్రాయణగుట్టలో రేవ్ పార్టీ వీడియో  కలకలం రేపుతోంది. కొంత మంది మందేసి అమ్మాయిలతో అసభ్యకరంగా డ్యాన్సులు చేస్తూ చిందేశారు.  ఫిబ్రవరి 13న లేక్ వ్యూ హిల్స్ వద్ద ఉన్న ఇంపీరియల్ ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ రేవ్ పార్టీలో ఎంఐఎం నేత పర్వేజ్ తో పాటు మరి కొంత మంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో.. చంద్రాయణ గుట్ట పోలీసులు పర్వేజ్ తో పాటు మరి కొంతమందిపై కేసు నమోదు చేశారు. ఈ రేవ్ పార్టీ గురించి పూర్తి వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు.