రాజస్తాన్ లో కుప్పకూలి పేలిపోయిన ఆర్మీ ఫైటర్ జెట్

రాజస్తాన్ లో కుప్పకూలి పేలిపోయిన ఆర్మీ ఫైటర్ జెట్

రాజస్తాన్ రాష్ట్రంలో ఘోరం.. ఇండియన్ ఆర్మీకి చెందిన ఫైటర్ జెట్ కుప్పకూలి పేలిపోయింది. పూర్తిగా మంటల్లో కాలిపోయింది. 2025, జూలై 9వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఈ ఘటన జరిగింది. రాజస్థాన్ రాష్ట్రం చురు జిల్లాలోని పంట పొలాల్లో ఆర్మీ ఫైటర్ జెట్ కుప్పకూలి పేలిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనలో పైలెట్ మృతి చెందాడు. ఆర్మీ ఫైటర్ జెట్ విమానం మంటల్లో కాలిపోతున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రమాదానికి గురైనది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన జాగ్వార్ ఫైటర్ జెట్ గా చెబుతున్నారు అధికారులు. విషయం తెలిసిన వెంటనే ఆర్మీ ఉన్నతాధికారులు స్పాట్ కు చేరుకున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఫైటర్ జెట్ కు సంబంధించిన అనేది శకలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పెద్ద సంఖ్యలో స్థానికులు ఉన్నారు. విమాన శకలాలను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ప్రమాదానికి కారణాలు ఏంటీ.. ఎందుకు కూలిపోయింది అనే విషయాలను అధికారులు ప్రకటించాల్సి ఉంది.