5 నిమిషాల్లో తప్పిన ఘోర విమాన ప్రమాదం : టేకాఫ్ కు ముందు కుప్పకూలిన పైలెట్

5 నిమిషాల్లో తప్పిన ఘోర విమాన ప్రమాదం : టేకాఫ్ కు ముందు కుప్పకూలిన పైలెట్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఫ్లైట్ ఎక్కాలంటేనే భయపడుతున్నారు జనం. ఈ ప్రమాదంలో ఒక్కరు అదీ అదృష్టవశాత్తు బతికి బయటపడితే.. మిగతా ప్రయాణికులంద ఈ ఘటన తర్వాత చాలా విమానాలు సాంకేతిక లోపంతో అత్యవసర ల్యాండింగ్ అయిన ఘటనలు ఉన్నాయి. తాజాగాబెంగళూరు నుంచి ఢిల్లీ  ఎయిర్ ఇండియా విమానానికి కూడా తృటిలో ప్రమాదం తప్పినట్టయింది. ఈ క్రమంలో విమానయాన భద్రత, పైలట్ల పని ఒత్తిడి, విమానయాన సంస్థల నియంత్రణపై చర్చ మళ్ళీ తెరపైకి వచ్చింది. 

శుక్రవారం(జూలై4) బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించిన ఓ పైలట్ టేకాఫ్ అవ్వడానికి కొద్ది క్షణాల ముందు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. టేకాఫ్ అవుతుందన్న సమయంలో ఎయిర్ ఇండియా పైలట్ కుప్పకూలాడు. 

కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానం AI2414కి చెందిన పైలట్..విమానం బయలుదేరడానికి కొద్దిసేపటి ముందు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పైలట్ కాక్ పిట్ లో ఉండగానే విమానం నడిపేందుకు అవసరమైన తప్పనిసరి డాక్యుమెంట్స్ (టెక్ లాగ్) పై సంతకం చేయబోతుండగా కుప్పకూలినట్లు తెలుస్తోంది.వెంటనే పైలట్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఎయిర్ ఇండియా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..పైలట్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. 

ప్రయాణం ఆలస్యం.. 

ఈ అత్యవసర పరిస్థితి కారణంగా AI2414 విమానం ఆలస్యంగా బయలుదేరింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎయిర్ ఇండియా వెంటనే వేరే పైలట్ ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత విమానం ఢిల్లీకి బయలుదేరింది.

గతంలో ఇలాంటివి.. 

ఈ సంఘటన ఇటీవల అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం AI171 కూలిపోయిన ఘటన జరగడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 275 మంది మృతికి కారణమైన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా ,భారతీయ విమానయాన రంగంపై భద్రతా ప్రోటోకాల్స్, నిర్వహణ విధానాలపై నిఘా పెరిగింది.

►ALSO READ | గర్వించదగ్గ క్షణం..ట్రినిడాడ్, టొబాకో పార్లమెంట్లో..మన జనగణమన గీతం ఆలపించారు

ఇటీవలే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఎయిర్ ఇండియాలో పైలట్ డ్యూటీ అవర్స్, రెస్ట్ పీరియడ్ రెగ్యులేషన్స్ ను ఉల్లంఘనపై ఆందోళన వ్యక్తం చేసింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి బాధ్యులైన ముగ్గురు సీనియర్ అధికారులను తొలగించాలని ఆదేశించింది.

ఇటీవల తరుచుగా జరుగుతున్న విమాన ప్రమాద ఘటనలు దేశంలో విమానయాన భద్రత, పైలట్ల పని ఒత్తిడి, విమానయాన సంస్థల నియంత్రణపై చర్చను మళ్ళీ తెరపైకి తీసుకువచ్చాయి. భారతీయ విమానయాన రంగంపై భద్రతా ప్రోటోకాల్స్, నిర్వహణ విధానాలపై నిఘా పెరిగింది.