తప్పతాగి విమానాన్ని నడిపిన పైలట్ ను ఎయిర్ ఇండియా విధుల నుంచి తొలగించింది. ఆన్ డ్యూటీలో ఉండి ఎయిర్ ఇండియా పైలట్ మద్యం సేవించనట్లు బ్రీత్ లైజర్ టెస్ట్ లో తేలడంతో అతడిని సస్పెండ్ చేశారు. ఫుకెట్-ఢిల్లీ విమాన పైలట్-ఇన్-కమాండ్‌ను సర్వీసు నుంచి తొలగించిన కొద్ది రోజులకే ఈ తాజా ఘటన చోటుచేసుకోవడం విమాన ప్రయాణాల్లో భద్రతపై ప్రయాణికులనుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
సెప్టెంబర్ 6న జ్యూరిచ్ నుంచి న్యూఢిల్లికి ప్రయాణించిన ఎయిర్ ఇండియా విమానం AI151 విమానంలో విధులు నిర్వహించిన పైలట్ తప్పతాగి విమానం నడిపినట్లు బ్రీత్ లైజర్ టెస్ట్ లో తేలడంతో ఆ పైలట్ ను సస్పెండ్ చేసింది. అధికారులు రిపోర్టు ప్రకారం.. జ్యూరిచ్ చేరుకోగానే ఎయిర్ పోర్టులో పైలట్ నుంచి మద్యం వాసన రావడంతో చెక్ చేయగా మద్యం సేవించినట్టు గుర్తించారు. వెంటనే విమానాన్ని నిలిపివేసి డీజీసీఏకు సమాచారం అందించారు అక్కడి అధికారులు. అనంతరం అతడిని ప్రయాణికుడిగా భారత్ కు పంపించారు.
ఫైనల్ మెడికల్ టెస్టులు రిపోర్టు, విచారణ పూర్తయ్యే వరకు అతడిని సస్పెన్షన్‌లోనే ఉంచారు. మద్యం తీసుకున్నట్లు నిర్ధారణ అయితే క్రమశిక్షణా చర్యలు తీసుకోనుంచి డీజీసీఐ. అయితే ఈ విషయంపై ఎయిర్ ఇండియా ఇప్పటివరకు ఎటువంటి అధికారికి ప్రకటన చేయకపోవడం గమనార్హం.
పైలట్లలో పదేపదే రూల్స్ అతిక్రమణ సమస్యలు
ఇటీవల జరిగిన కొన్ని సంఘటన దృష్ట్యా ఎయిర్ ఇండియ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నప్పటికీ తరుచుగా ఇలాంటి ఘటనలు చోటుకుంటున్నాయి. పైలట్లకు డ్రగ్స్ టెస్టులు తప్పనిసరిగా నిర్వహించడంతో పాటు, రూల్స్ పాటించడం, కార్యాచరణ తీరును ఎయిర్‌లైన్ నిరంతరం పర్యవేక్షిస్తోంది. భద్రతపై దృష్టి సారించిన అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
ఫుకెట్-ఢిల్లీ విమాన ఘటన..
ఫుకెట్-నుంచి ఢిల్లీ కి ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియాకు చెందిన A320 విమానం అకస్మాత్తుగా దాదాపు 300 అడుగుల ఎత్తును కోల్పోయి గాల్లో ఉండగానే కుదుపులకు దారి తీసింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (AAIB) తన ప్రాథమిక రిపోర్టులో పైలట్ డ్రగ్స్ వాడకాన్ని తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా పేర్కొంటూ, తగిన చర్యలు తీసుకోవాలని DGCAను కోరింది.సెప్టెంబర్ 4న, జరిగిన ఈ ఘటనలో పైలట్-ఇన్-కమాండ్ డ్రగ్స్ తీసుకున్నట్లు తేలడంతో అతడిని సస్పెండ్ చేశారు.
