భారత్ మాల్డీవుల మధ్య ఎయిరిండియా సేవలకు 46ఏళ్లు

భారత్  మాల్డీవుల మధ్య ఎయిరిండియా సేవలకు 46ఏళ్లు

భారత్ మాల్దీవుల మధ్య ఎయిరిండియా విమానాల రాకపోకలు ప్రారంభమై 46 ఏళ్లు పూర్తయ్యాయి. 1976 ఫిబ్రవరిలో ఎయిరిండియా తొలి ఫైట్ త్రివేండ్రం నుంచి మాలేకు చేరుకుంది. నాలుగున్నర దశాబ్దాలకుపైగా కొనసాగుతున్న ప్రస్థానానికి గుర్తుగా మాలే ఎయిర్పోర్టులో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. భారత్ నుంచి మాలే ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఎయిరిండియా ఏఐ 267 విమానానికి నీటి జల్లులతో స్వాగతం పలికారు. వాటర్ కెనాన్ సెల్యూట్ కు సంబంధించి ఎయిరిండియా తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. 

మరిన్ని వార్తల కోసం..

సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టుకు కేసీఆర్ శంకుస్థాపన

బిగ్‌బాస్ నుండి తప్పుకున్న కమల్‌హాసన్‌