బిగ్‌బాస్ నుండి తప్పుకున్న కమల్‌హాసన్‌

బిగ్‌బాస్ నుండి తప్పుకున్న కమల్‌హాసన్‌

బిగ్ బాస్ అల్టిమేట్ రియాలిటీ షో నుంచి సినీ నటుడు కమల్ హాసన్ వైదొలిగారు.కమల్ రాబోయే సినిమా విక్రమ్ నిర్మాణ కార్యకలాపాల మధ్య షెడ్యూల్‌ కుదరపోవడంతో.. తాను బిగ్‌ బాస్‌ షో నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.విక్రమ్ సినిమా షూటింగ్‌..బిగ్ బాస్ అల్టిమేట్ రెండింటినీ కలిసి నిర్వహించడం ఆయనకు అసాధ్యంగా మారింది. దీంతో కమల్‌ హాసన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఫిబ్రవరి 20 తర్వాత తాను షో  ఎపిసోడ్‌ల నుండి వైదొలుగుతున్నట్లు కమల్‌ హాసన్ చెప్పారు. అయితే, ఇప్పుడు రెండు ప్రాజెక్టులను ఏకకాలంలో నిర్వహించడం అసాధ్యమని ఆయన అన్నారు. తమిళ బిగ్ బాస్ డిజిటల్ అవతార్‌ను ప్రారంభించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని కమల్ హాసన్ అన్నారు. రియాలిటీ షోతో తాను "అటాచ్డ్" అయ్యానని చెప్పారు.

విక్రమ్‌ సినిమాలో ఫహద్ ఫాసిల్,విజయ్ సేతుపతితో స్క్రీన్ షేర్‌ చేసుకోనున్నారు కమల్‌హాసన్‌.

మరిన్ని వార్తల కోసం..

అల్లు అర్జున్ మూవీకి అరుదైన గౌరవం