అల్లు అర్జున్ మూవీకి అరుదైన గౌరవం

అల్లు అర్జున్ మూవీకి అరుదైన గౌరవం

హైదరాబాద్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మికా మందన్న హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ సంస్థ నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా పెద్ద హిట్ గా నిలిచింది. డిసెంబర్ 17న విడుదలైన ఈ మూవీ.. బాక్సాఫీసు దగ్గర కలెక్షన్ల సునామీని సృష్టించింది. ముఖ్యంగా హిందీలో భారీ హిట్ గా నిలిచింది. పుష్పరాజ్ గా బన్నీ నటన, డ్యాన్సులతోపాటు పుష్ప క్యారెక్టర్ ను డిజైన్ చేసిన తీరుకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. తాజాగా ఈ చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. భారతీయ సినిమాలో అత్యున్నత పురస్కారమైన ‘దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు’ను పుష్ప గెలుచుకుంది. 

అనేక బాలీవుడ్ సినిమాలను అధిగమించి.. ‘పుష్ప: ది రైజ్’ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికైంది. ఈ పురస్కారం దక్కడంపై సినిమా యూనిట్ హర్షం వ్యక్తం చేసింది. కాగా, ఎర్రచందనం స్మగ్లింగ్ నేప‌థ్యంలో తెరెక్కిక్కిన ఈ చిత్రం సెకండ్ పార్ట్ పుష్ప 2ను ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రారంభించింది. ఈ ఏడాది ద్వితీయార్థంలో పార్ట్‌ 2ను భారీ స్థాయిలో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం:

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా

దాణా స్కాంలో లాలూ ప్రసాద్కు శిక్ష ఖరారు