
బ్యాంకాక్: థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ లో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోయింది. నానాటికీ వాయు కాలుష్యం పెరిగిపోతుండడంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. గడిచిన వారం రోజుల్లోనే బ్యాంకాక్ లో ఏకంగా 13 లక్షల మంది అనారోగ్యానికి గురయ్యారని థాయ్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఎయిర్ క్వాలిటీ పడిపోవడంతో బయటకు రావొద్దంటూ పిల్లలు, గర్భిణీలకు ప్రభుత్వం హెచ్చరించింది. గాలి నాణ్యత డేంజర్ లెవల్ కు పడిపోయిందని, గాలిలో కలిసిపోయిన ధూళి కణాలు శ్వాస ద్వారా మన శరీరాల్లోకి చేరి అవయవాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, బయటకు వెళ్లాల్సి వస్తే ఎన్ 95 మాస్కు ధరించాలని సూచించారు. ఉద్యోగులు ఇంట్లో నుంచే పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అదేవిధంగా స్కూళ్లు, పార్క్ లలో నో డస్ట్ రూమ్ పేరుతో ఎయిర్ ఫ్యూరిఫయర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.