V6 News

ఎయిర్‌‌‌‌బస్, రాంగ్సన్స్ ఒప్పందం ఖరారు

ఎయిర్‌‌‌‌బస్, రాంగ్సన్స్ ఒప్పందం ఖరారు

హైదరాబాద్​, వెలుగు: విమానాల విడిభాగాల సరఫరా కోసం మైసూరుకు చెందిన రాంగ్సన్స్ ఏరోస్పేస్ సంస్థ ఎయిర్‌‌‌‌బస్​తో దీర్ఘకాల ఒప్పందం కుదుర్చుకుంది. ఫ్లూయిడ్ డిస్ట్రిబ్యూషన్, కమ్యూనికేషన్, థర్మల్ మేనేజ్‌‌‌‌మెంట్ సిస్టమ్స్‌‌‌‌లో తమకు ఉన్న సామర్థ్యాలకు గుర్తింపుగా ఈ కాంట్రాక్టు లభించిందని తెలిపింది. ఎయిర్‌‌‌‌బస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఒలివియర్, రాంగ్సన్స్ ఎండీ పవన్ రంగ ఈ అవార్డ్ లెటర్‌‌‌‌పై సంతకాలు చేశారు. 

ఈ ఒప్పందం ద్వారా ఎయిర్‌‌‌‌బస్ ఏ320 ఫ్యామిలీకి అవసరమైన అత్యంత కీలకమైన విమాన ట్యూబ్‌‌‌‌లు. డక్ట్ అసెంబ్లీలను తయారు చేసే తొలి భారతీయ టియర్-1 కంపెనీగా రాంగ్సన్స్ ఏరోస్పేస్ నిలవబోతోంది. ఈ భాగస్వామ్యం సంస్థను విశ్వసనీయ గ్లోబల్ భాగస్వామిగా మరింత బలోపేతం చేస్తుందని రాంగ్సన్స్ సీనియర్​ఎగ్జిక్యూటివ్​ఒకరు తెలిపారు.