హైదరాబాద్లో 5జీ సేవలు ప్రారంభించిన ఎయిర్ టెల్

హైదరాబాద్లో 5జీ సేవలు ప్రారంభించిన ఎయిర్ టెల్

ఎయిర్ టెల్ కంపెనీ హైదరాబాద్ లో 5G సేవలను ప్రారంభించింది. నగరంలోని పలు కీలక ప్రాంతాలతో పాటు మెట్రోరైల్, రైల్వే స్టేషన్స్, బస్ టర్మినల్స్ వంటి రవాణా కేంద్రాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. బేగంపేటలోని ఎయిర్ టెల్ ఆఫీస్, బేగంపేట మెట్రో స్టేషన్ లో 5G నెట్ వర్క్ సర్వీసులపై పబ్లిక్ కు డెమో ఇచ్చారు. అన్ని 5G స్మార్ట్ ఫోన్ల ద్వారా అల్ట్రా ఫాస్ట్ నెట్వర్క్ ను పొందొచ్చని వెల్లడించారు.

5G ప్లస్ సర్వీసులు సికింద్రబాద్, కాచీగూడ రైల్వేస్టేషన్, ఎంజీబీఎస్ దగ్గర హైస్పీడ్ నెట్ వర్క్ ఎంజాయ్ చేయొచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు. వెస్ట్రన్ సిటీ, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, బోయిన్ పల్లి, కొంపల్లితో పాటు ఉప్పల్, నాగోల్ వంటి పలు ఏరియాల్లోని ప్రజలు కూడా ఎయిర్ టెల్ 5జీ నెట్ వర్క్ ను వినియోగించుకోవచ్చు. రానున్న రోజుల్లో నగరవ్యాప్తంగా 5జీ సేవల విస్తరణ ఉంటుందని స్పష్టం చేశారు.